Covid Vaccine: అందరి చూపు కోవిన్‌పైనే.. వ్యాక్సిన్ కోసం 36 గంటల్లో లక్షల్లో రిజిస్ట్రేషన్లు.. చేసుకున్నది ఎవరో తెలుసా..
Covid Vaccine: దేశంలో మళ్ళీ కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ వైరస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మరింత వేగం వంతం చేయడమే కాదు.. పిల్లలకు..
Covid Vaccine: దేశంలో మళ్ళీ కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ వైరస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మరింత వేగం వంతం చేయడమే కాదు.. పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి 15 ఏళ్ల నుంచి 18ఏళ్లలోపు యువతీ యువకులకు టీకా కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే ఈ టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.
జనవరి 1వ తేదీ శనివారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు. కొవిన్ వెబ్‌సైట్‌లో 15 ఏళ్ల నుంచి 18ఏళ్లలోపు వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలు పెట్టిన 36 గంటల్లోనే భారీ సంఖ్యలో టీనేజన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జనవరి 2వ తేదీ మధ్యాహ్నం వరకూ 4.5 లక్షల మందికి పైగా యువతీ యువకులు వ్యాక్సిన్ కోసం విన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అయితే అన్ని వయసులు వారు కలిపి ఇప్పటి వరకూ 92.23 కోట్ల మంది కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసు ఉన్న వారు 57.39 కోట్ల మంది, 45 ఏండ్ల పైబడిన వాళ్లు 34.78 కోట్ల మంది ఉన్నారని కేంద్రం వెల్లడించింది.
అయితే ప్రస్తుతం పిల్లలకు కొవాగ్జిన్ వ్యాక్సినేషన్ మాత్రమే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి 3 నుంచి 15 – 18 ఏండ్ల మధ్య వయసు వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని గత వారం ప్రధాని మోడీ ప్రకటించారు. ఇక ఈ నెల 10 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లు, హెల్త్ సిబ్బంది తో పాటు 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.
మరోవైపు రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రభుత్వాలకు మళ్ళీ తాత్కాలిక ఆస్పత్రులను, కరోనా నిర్ధారణ టెస్టులను పెంచాలంటూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఆదేశాలను జారీ చేసింది.