AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నమయ్య మార్గం అభివృద్ధి పనులు షురూ.. ఎప్పటికి అందుబాటులోకి రానున్నదంటే..

Tirupati: కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన ప్రముఖ క్షేత్రం తిరుమల తిరుపతి. ఏడుకొండలమీద కొలువైన కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు కాలినడకన వెళ్తారు. అయితే ఇప్పుడు రెండు..

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నమయ్య మార్గం అభివృద్ధి పనులు షురూ.. ఎప్పటికి అందుబాటులోకి రానున్నదంటే..
Annamaiah Margam
Surya Kala
|

Updated on: Jan 02, 2022 | 7:11 PM

Share

Tirupati: కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన ప్రముఖ క్షేత్రం తిరుమల తిరుపతి. ఏడుకొండలమీద కొలువైన కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు కాలినడకన వెళ్తారు. అయితే ఇప్పుడు రెండు కాలినడక మార్గాలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అయితే మరో కాలి నడక మార్గాన్ని టీటీడీ సిద్ధం చేయడానికి కార్యాచరణ రూపొందించింది.  శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు నడచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోను, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేయనున్నామని టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఈ మేరకు సమగ్ర ని నివేదికలు (డిపిఆర్) తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం సుబ్బారెడ్డి పరిశీలించారు. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు వెంటనే సమగ్ర సర్వే చేసి అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. హైదరాబాద్, వై ఎస్ ఆర్ కడప మార్గం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు అన్నమయ్య మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భారీ వర్షాల వల్ల ఇటీవల భారీ కొండ చరియలు విరిగిపడి తిరుమలకు ఘాట్ రోడ్ భారీగా దెబ్బతిన్న విషయాన్ని ఛైర్మన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా కూడా అన్నమయ్య మార్గం ఉపయోగ పడుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ మార్గం అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా మామండూరు నుంచి తిరుమల కు 23 కిలోమీటర్ల దూరం వరకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చైర్మన్ తెలిపారు.

దివంగత సిఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ మార్గం అభివృద్ధి గురించి ఆలోచన చేశారని, అప్పటి టీటీడీ ధర్మ కర్తల మండలిలో కూడా చర్చ జరిగిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. Also Read:  ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులున్నాయా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే డబ్బుకు లోటు ఉండదు