Air Travel: విమాన ప్రయాణం ఖరీదు.. జెట్‌ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి.. లీటర్‌కి ఎంత పెరిగిందంటే..?

Air Travel: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను 2.75 శాతం పెంచారు. అయితే వాణిజ్య వినియోగ

Air Travel: విమాన ప్రయాణం ఖరీదు.. జెట్‌ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి.. లీటర్‌కి ఎంత పెరిగిందంటే..?
At Airport
Follow us
uppula Raju

|

Updated on: Jan 02, 2022 | 5:02 PM

Air Travel: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను 2.75 శాతం పెంచారు. అయితే వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్ల (ఎల్‌పిజి) ధరలను సిలిండర్‌పై రూ.102.5 తగ్గించారు. అక్టోబర్ 2021 తర్వాత మొదటిసారి LPG ధరలు తగ్గాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీల ధరల నోటిఫికేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.2,039.63 పెరిగి రూ.76,062.04కి చేరుకుంది. అంతకుముందు డిసెంబర్‌లో విమాన ఇంధన ధరలను రెండుసార్లు తగ్గించారు. నవంబర్, డిసెంబర్ మధ్యలో అంతర్జాతీయ చమురు ధరల పతనం కారణంగా ATF ధరలు తగ్గించారు. నవంబర్ మధ్యలో, ATF ధర లీటర్‌కు గరిష్టంగా 80,835.04 రూపాయలకు చేరుకుంది. ఆ తర్వాత డిసెంబర్ 15న ATF ధరలు లీటర్‌కు రూ. 6,812.25 లేదా 8.4 శాతం చొప్పున తగ్గించారు.

1వ తేది, 16వ తేదీల్లో ధరలలో మార్పు విమాన ఇంధన ధరలు ప్రతి నెల 1వ తేదీ, 16వ తేదీల్లో సవరిస్తారు. అదే సమయంలో వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ సిలిండర్ల ధర ప్రతి నెలా మొదటి తేదీన సవరిస్తారు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధర రూ.102.5 తగ్గింది. ఈ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తాయి. అక్టోబర్ 6, 2021 తర్వాత ఎల్‌పిజి ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. డిసెంబర్ 1న, వాణిజ్య అవసరాల కోసం ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,734 నుంచి రూ.2,101కి పెరిగింది.

మెట్రోలలో వాణిజ్య సిలిండర్ల ధర ధర తగ్గింపు తర్వాత ముంబైలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1948.50, కోల్‌కతాలో రూ.2076, చెన్నైలో రూ.2131గా ఉంది. నిన్నటి వరకు ఈ ధర ఢిల్లీలో రూ.2101, కోల్‌కతాలో రూ.2177, ముంబైలో రూ.2051, చెన్నైలో రూ.2234.50గా ఉంది. అయితే వంటగదిలో ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఒక్కో సిలిండర్‌పై రూ.899.50గా ఉంచారు. అక్టోబర్ 6 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే, అంతకు ముందు, జూలై 2021 నుంచి దాదాపు ప్రతి నెల దాని ధరలు సిలిండర్‌కు రూ.100 చొప్పున పెరుగుతూ వచ్చాయి. ఇక గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.95.41, డీజిల్ రూ.86.67గా విక్రయిస్తున్నారు.

CISF నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హతలు, జీతభత్యాలు ఎలా ఉన్నాయంటే..?

Jio, Airtel, Vi రూ. 666 రీఛార్జ్ ప్లాన్‌లో తేడాలేంటి..? వ్యాలిడిటీ, ఫీచర్స్‌, బెనిఫిట్స్‌ తెలుసుకోండి..

Worshiping Trees: ఈ చెట్లలో దేవతలు నివసిస్తారట.. అందుకే పూజిస్తారట..? ఆ చెట్లు ఏంటంటే..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!