Kidney Health Tips: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఐదు పదార్థాలకు దూరంగా ఉండండి

Health Tips for Kidney: మూత్రపిండాలు శరీరంలోని అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. ఇవి శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Jan 02, 2022 | 12:47 PM

ఉప్పు - ఉప్పు శరీరానికి అవసరం. కానీ దాని అధిక మొత్తంలో తీసుకోవడం అనర్ధం. అధికంగా ఉప్పు తీసుకోవడం మూత్రపిండాల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. కావున ఉప్పును మితంగా మాత్రమే తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

1 / 5
రెడ్ మీట్ - రెడ్ మీట్ కూడా మితంగా తీసుకోవాలి. వాస్తవానికి రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల ఇది జీవక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

2 / 5
స్వీట్లు, డ్రింక్స్ - మీరు స్వీట్లు, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రమాదకరం. ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం మీరు వాటిని వీలైనంత వరకు నివారించాలి. ఈ వస్తువులలో పెద్ద మొత్తంలో కృత్రిమ స్వీటెనర్ ఉంటుంది. ఇది మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

3 / 5
కాఫీ - ఎక్కువ కాఫీ తాగడం మూత్రపిండాలకు హానికరం. ఇది తీవ్రమైన కెఫిన్‌ను కలిగి ఉంటుంది. ఇది మూత్రపిండాలకు విషపూరితమైనదని హెచ్చరిస్తున్నారు. మీకు ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉన్నట్లయితే.. ఇది మీకు ప్రమాదకరం. ఎందుకంటే ఇది కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది.

4 / 5
ఆల్కహాల్ - ఆల్కహాల్‌ను నివారించడం వల్ల మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు నిపుణులు. ఆల్కహాల్ మీ కాలేయంపై మాత్రమే కాకుండా మీ మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

5 / 5
Follow us