AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కొత్త సంవత్సరంలో ఈ మూడు విషయాలకూ ప్రాధాన్యం ఇవ్వండి.. ఆరోగ్యంగా చిరకాలం జీవించండి!

కరోనా మహమ్మారి మధ్య కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాం. ఈ సందర్భంగా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మన జీవితాన్ని ఆరోగ్యవంతంగా..ఎక్కువరోజులు కొనసాగేలా ఎలా చేసుకోవాలి అనేవి తెలుసుకుందాం.

Health Tips: కొత్త సంవత్సరంలో ఈ మూడు విషయాలకూ ప్రాధాన్యం ఇవ్వండి.. ఆరోగ్యంగా చిరకాలం జీవించండి!
Healthy Tips
KVD Varma
|

Updated on: Jan 02, 2022 | 12:46 PM

Share

Health Tips: కరోనా మహమ్మారి మధ్య కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాం. ఈ సందర్భంగా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మన జీవితాన్ని ఆరోగ్యవంతంగా..ఎక్కువరోజులు కొనసాగేలా ఎలా చేసుకోవాలి అనేవి తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం అమెరికాకు చెందిన డాక్టర్ మైఖేల్ గ్రెగర్ ఇటీవల సమాధానమిచ్చారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పరిశోధనను ఉటంకిస్తూ, ఆరోగ్యకరమైన ..దీర్ఘాయువు మూడు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ గ్రెగర్ చెప్పారు.

ఆయన చెప్పిన మూడు అలవాట్లు ఏంటంటే – పోషకాహారం సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం, ధూమపానం చేయకపోవడం .. రోజూ 21 నిమిషాల పాటు వ్యాయామం చేయడం. CDC చేసిన 6 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన ప్రకారం, ఈ జీవనశైలిని అనుసరించే వ్యక్తులు వారి మరణ అవకాశాలను 82% తగ్గించారు.

ఈ 3 అలవాట్లను మీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలంటే..

1. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి: డాక్టర్ గ్రెగర్ ప్రకారం, మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఈరోజు అదనపు నూనె, మసాలాలు.. జంక్ ఫుడ్‌ను వదిలివేయండి. మీ ఆహారంలో ఎక్కువ పండ్లు.. కూరగాయలను చేర్చండి. శరీరం ఆక్సీకరణం చెందడం ప్రారంభించడం వల్ల వేగంగా వృద్ధాప్యం ముంచుకువస్తుంది. వ్యాధులతో బాధపదాల్సి వస్తుంది. కానీ యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. మీ ఆహారంలో కనీసం మాంసాహారాన్ని చేర్చుకోవాలని డాక్టర్ గ్రెగర్ చెప్పారు. కారణం- పండ్లు .. కూరగాయల కంటే మాంసంలో 64 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

2. ధూమపానానికి దూరంగా ఉండండి: స్మోకింగ్‌కి మన వృద్ధాప్యంతో ప్రత్యేక సంబంధం ఉందని యూనివర్సిటీ ఆఫ్ చికాగో మెడిసిన్ పరిశోధనలో తేలింది. ధూమపానం వలన పురుషులు.. మహిళలు ఇద్దరికీ DNA దెబ్బతింటుంది. మన జీవితకాలాన్ని తగ్గిస్తుంది. మీరు మంచి ఆహారం తీసుకున్నప్పటికీ, ధూమపాన వ్యసనం మీ జీవితాన్ని చాలా తగ్గిపోయేలా చేస్తుంది.

3. రోజువారీ వ్యాయామం మోతాదు: మహమ్మారిలో లాక్డౌన్ .. ఇంటి నుంచి పని చేయడం మన కదలికను పూర్తిగా నిలిపివేసింది. డాక్టర్ గ్రెగర్ ప్రకారం, కూర్చోవడం కూడా ఒక రకమైన ధూమపానం లాంటిది. ప్రతిరోజూ కనీసం 21 నిమిషాల పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి అంటున్నారు. ఇందులో మీరు జాగింగ్-రన్నింగ్ నుంచి ఇష్టమైన క్రీడలను కూడా ఆడవచ్చు. ఆన్‌లైన్ పని .. చదువుల నుంచి చిన్న విరామం తీసుకోవడం కూడా మంచి ఎంపిక. మీ పెంపుడు జంతువులను సుదూర నడకలకు కూడా తీసుకెళ్లండి. ప్రకృతితో సమయం గడపండి.

ఇవి కూడా చదవండి: Corona Vaccination: 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. మొదటి రోజు ఎంతమంది నమోదు చేసుకున్నారో తెలుసా?

New Year Horoscope: కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్య..ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ఉందా? మరెందుకాలస్యం..