AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pressure Cooked Rice: ప్రెషర్‌ కుక్కర్‌లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..? ఆరోగ్య నిపుణుల క్లారిటీ..!

Pressure Cooked Rice: సాధారణం చాలా మంది ఇళ్లలో అన్నం ప్రెషర్‌ కుక్కర్లో వండుతుంటారు. ఒకప్పుడు ప్రెషర్‌ కుక్కర్లు లేని సమయంలో కట్టెల పొయ్యిపై, ఆ తర్వాత..

Pressure Cooked Rice: ప్రెషర్‌ కుక్కర్‌లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..? ఆరోగ్య నిపుణుల క్లారిటీ..!
Subhash Goud
|

Updated on: Jan 02, 2022 | 6:40 PM

Share

Pressure Cooked Rice: సాధారణం చాలా మంది ఇళ్లలో అన్నం ప్రెషర్‌ కుక్కర్లో వండుతుంటారు. ఒకప్పుడు ప్రెషర్‌ కుక్కర్లు లేని సమయంలో కట్టెల పొయ్యిపై, ఆ తర్వాత గ్యాస్‌ సిలిండర్‌పై బౌల్‌లో వండేవారు. ఇప్పుడు కాలం మారుతున్నకొద్ది విధానాన్ని మార్చుకుంటున్నారు. ప్రెషర్‌ కుక్కర్లలో వండే వారు చాలా మందే ఉన్నారు. దీని వల్ల గ్యాస్‌ ఆదా కావడమే కాకుండా అన్నం త్వరగా అవుతుంది. మన దేశంలో వరి అన్నం ప్రధానమైనది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా చాలా మంది తీసుకుంటారు. అయితే ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం వండితే ఆరోగ్యానికి మంచిదేనా..? కాదా అన్న సందేహం కలుగుతుంటుంది. ఇప్పుడు చాలా మంది ప్రెషర్‌ కుక్కర్లకు అలవాటు పడ్డారు.

ఇక ఆరోగ్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం చూస్తే.. ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిదేనని సూచిస్తున్నారు. ప్రెషర్‌ కుక్కర్‌లో వండే అన్నం రుచిగా ఉండడమే కాకుండా కుక్కర్‌లో వండిన అన్నంలో పిండి పదార్థం తొలగిపోతుందట. అంతేకాకుండా ఫ్యాట్‌ కంటెంట్‌ కూడా తక్కువగా ఉంటుంది. కుక్కర్‌లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్‌ లాంటి నీటిలో కలిగే పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక కుక్కర్‌లో వండిన అన్నంతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు. అన్నం సులువగా జీర్ణమవుతుంది. ఈ అన్నంలో ప్రోటీన్స్‌, పిండి పదార్థాలు, ఫైబర్‌ కంటెంట్‌ లాంటి పోషకాలు కూడా ఉంటాయట. ప్రెషర్‌ కుక్కర్‌లో వండటం వల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హనికర బ్యాక్టీరియా నశించిపోతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గ్యాస్‌ మంటపై వండే అన్నం ఎగిరినట్లుగా ఉండకుండా ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం ఎగరకపోవడం వల్ల బియ్యం మెతుకులు ఇరగకుండా ఉంటాయి. ఏది ఏమైనా ప్రెషర్‌ కుక్కర్‌లో వండే అన్నం ఆరోగ్యానికి ప్రయోజనమేనని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

(గమనిక: ఇందులోని అంశాలు ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.)

ఇవి కూడా చదవండి:

Diabetes: డయాబెటిస్‌ బారిన పడేవారు అధికంగా పురుషులే.. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలో కీలక విషయాలు

Black Coffee: మీకు బ్లాక్ కాఫీ.. బ్లాక్ టీ.. డార్క్ చాక్లెట్లు ఇష్టమా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!