Diabetes: డయాబెటిస్‌ బారిన పడేవారు అధికంగా పురుషులే.. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలో కీలక విషయాలు

Diabetes: ప్రస్తుతం మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలి, ఒత్తిళ్లు, ఇతర కారణాల వల్ల డయాబెటిస్‌ ఉన్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది...

Diabetes: డయాబెటిస్‌ బారిన పడేవారు అధికంగా పురుషులే.. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలో కీలక విషయాలు
Follow us

|

Updated on: Dec 31, 2021 | 7:54 AM

Diabetes: ప్రస్తుతం మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలి, ఒత్తిళ్లు, ఇతర కారణాల వల్ల డయాబెటిస్‌ ఉన్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మందిని వెంటాడుతోంది మధుమేహం. మన దేశంలో డయాబెటిక్‌ రోగులు నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 50 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే మధుమేహం వచ్చేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు వెంటాడుతోంది. ఎక్కువగా 25-30 ఏళ్లలోపు ఉన్నవారు అధికంగా మధుమేహం బారిన పడుతున్నారు. ఇటీవల నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-5 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)లో దేశంలో నిర్వహించిన సర్వేలో షాకింగ్‌ నిజాలు వెలుగు చూశాయి.

సర్వేలో ఏం తేలిందంటే.. ► దేశంలో మహిళల కంటే పురుషులే ఎక్కువ డయాబెటిస్‌కు గురవుతున్నారు.

► ఈ వ్యాధికి గురవుతున్న పురుషుల్లో పట్టణ ప్రాంతాల వారు 21 శాతం, గ్రామీణ ప్రాంతాల వారు 16 శాతం ఉంటుంది.

► దేశ వ్యాప్తంగా మొత్తం పురుషుల్లో సరాసరి 18 శాతం మంది మధుమేహం బారిన పడ్డారు. మొత్తంగా 14 శాతం మందికి డయాబెటిస్‌ బారిన పడుతున్నారు.

► ఇక ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌ బారినపడిన వారిలో తమకు ఈ వ్యాధి ఉందని తెలిపిన వారు 54 శాత మంది ఉన్నారు. మనదేశంలో 49 శాతం మంది మాత్రమే సరైన సమయంలో డయాబెటిస్‌ను గుర్తిస్తున్నారు.

► అయితే 1980-2014 మధ్య కాలంలో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య 4 రెట్లు పెరిగినట్లు సర్వేలో తేలింది. 2000- 2016 మధ్యకాలంలో డయాబెటిస్‌ వ్యాధి మరణాలు 5శాతంగా ఉన్నాయి.

సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 180ఎంజీ/డీఎల్‌ కంటే ఎక్కువగా ఉంటే షుగర్‌ వ్యాధిగా పరిగణిస్తారు. వీరు క్రమం తప్పకుండా మందులు వాడి, ఆరోగ్య నియమాలు పాటించాల్సి ఉంటుంది. 160-180 మధ్య ఉంటే ప్రీ-డయాబెటిక్‌గా స్టేజ్‌గా పరిగణిస్తారు. వీరు ఆరోగ్యానికి సంబంధించి నియమాలు పాటించడం తప్పనిసరి. టైప్‌-1 డయాబెటిస్‌ జన్యుపరంగా వస్తుంది. వీరు 5 శాతం మందే ఉన్నారు. మిగిలిన 95% మందిలో షుగర్‌ వ్యాధి వారి జీవనశైలి మార్పులవల్ల వస్తున్నట్లు నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-5 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ద్వారా తేలింది.

ఇవి కూడా చదవండి:

Papaya Benefits: బొప్పాయితో అదిరిపోయే ప్రయోజనాలు.. బెనిఫిట్స్‌ ఎంటో తెలిస్తే షాకవుతారు..!

Health Tips: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు..!