Jagga Reddy: నాపై అవాకులు చెవాకులా.. చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించిన జగ్గారెడ్డి
కాంగ్రెస్ లో నేను కోవర్టునా? కోవర్టు ఎవరో అందరికీ తెలుసు. నాపై అవాకులు చెవాకులు రాస్తున్నారు.. చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ అంటే ఒక డ్రైవర్‌తో సమానం.
కాంగ్రెస్ లో నేను కోవర్టునా? కోవర్టు ఎవరో అందరికీ తెలుసు. నాపై అవాకులు చెవాకులు రాస్తున్నారు.. చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ అంటే ఒక డ్రైవర్‌తో సమానం. డ్రైవర్ సరిగా లేకుంటే.. అందరం మునిగిపోతాం. నేను అదే చెబుతున్నా… మన డ్రైవర్ సక్కగ లేరని అంటున్నా.. ఇది కూడా మాట్లాడకూడదంటారేంటి? నిజమేంటో చెబుతున్న నా మీద ఈ రాతలేంటి? ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్ తయారయ్యిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను డిస్టర్బ్ చేస్తున్నది ఆ పిచ్చి అభిమాన సంఘాలేనని విమర్శించారు. టీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకుంటే తననెవరూ ఆపరేరని చెప్పారు.
పీసీసీ అనే వాడు కాంగ్రెస్‌కు డ్రైవర్ లాంటివాడని అన్నారు. తప్పులు సరిదిద్దుకోమని చెబితే కూడా తప్పా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అధికారిక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ను కలిసిన తాను కోవర్ట్‌ను అయితే.. ఆయన్ను కలిసిన రేవంత్‌రెడ్డి కూడా కోవర్టే అని ఆరోపించారు.
తనపై దుష్ప్రచారాన్ని టీపీసీసీ చీఫ్ ఎందుకు ఖండించరని జగ్గారెడ్డి నిలదీశారు. కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఉంటా.. కాంగ్రెస్‌లోనే జీవిస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..