AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Omicron: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Telangana Omicron: దేశంలో కరోనా మహహ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక..

Telangana Omicron: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
Subhash Goud
|

Updated on: Jan 02, 2022 | 7:59 PM

Share

Telangana Omicron: దేశంలో కరోనా మహహ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక భారత్‌లో క్రమ క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదివారంకొత్తగా 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 84కు చేరింది.

కేసులు ఇంకా పూర్తిగా తగ్గిపోకముందు కొత్త వేరియంట్‌ వచ్చి ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను సైతం మరోసారి వణికిస్తోంది. భారత్‌లో ఈ ఒమిక్రాన్‌ వైరస్‌ రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

తెలంగాణలో మరోసారి కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనాతో విలవిలాడుతున్న ప్రజలకు అది చాలదన్నట్లు ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వారంలోపే కేసులు రెట్టింపవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మూడు వారాల క్రితం రాష్ట్రంలో తొలికేసు నమోదవగా.. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. ఒమిక్రాన్‌ ముప్పు పొంచిఉన్న దేశాల నుంచి వచ్చినవారిలోనే కాకుండా ఆ ముప్పు తక్కువున్న దేశాల నుంచి వచ్చిన వారికి సైతం ఒమిక్రాన్‌ నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే కమ్మూనిటీలోకి వెళ్లి ఉంటుందనే అనుమానాలకు తాజాగా నమోదవుతున్న కేసులు బలం చేకూరుస్తున్నాయి. ఒమిక్రాన్‌ విస్తరణపై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఒమిక్రాన్‌ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆదేశించారు. తెలంగాణలో ఈనెల 10 వరకు ఆంక్షలు కొనసాగతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బహిరంగసభలు, ర్యాలీలపై నిషేధం విధించారు. మత, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం ప్రకటించారు. మాస్కును తప్పనిసరి చేశారు. మాస్కు ధరించనివారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని ఆదేశించారు సీఎస్‌.

ఇవి కూడా చదవండి:

Coronavirus: కరోనా కలకలం.. నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌

బూస్టర్‌ డోస్‌ గురించి శుభవార్త.. ఒమిక్రాన్‌పై 88% ప్రభావం.. UK అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..