Omicron: హోమ్‌ టెస్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Omicron: ప్రపంచ దేశాలలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కొవిడ్‌ టెస్ట్‌ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. RT-PCR

Omicron: హోమ్‌ టెస్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Covid Test
Follow us

|

Updated on: Jan 02, 2022 | 7:53 PM

Omicron: ప్రపంచ దేశాలలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కొవిడ్‌ టెస్ట్‌ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. RT-PCR (రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్-పాలిమరేస్ చైన్ రియాక్షన్) పరీక్ష సాధారణంగా COVID-19 ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించే కచ్చితమైన పరీక్షగా నిపుణులు బావిస్తున్నారు. అయితే దీనికి కొంచెం సమయం పడుతుంది. కానీ కొంతమంది టెస్ట్‌ రిజల్ట్‌ తొందరగా తెలుసుకోవాలనుకుంటారు. దానికోసం వేగవంతమైన టెస్ట్‌లపై ఆధారపడతారు. అందులో ముఖ్యమైనది యాంటిజెన్ పరీక్ష.

ఈ యాంటిజెన్ పరీక్షల లాంటివి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇవి 5 నుంచి 30 నిమిషాల్లో ఫలితాలను ప్రకటిస్తాయి. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ని గుర్తించగలవా.. అంటే వ్యాధి నిపుణులు ఈ విధంగా చెబుతున్నారు. కాలేజ్ ఆఫ్ అమెరికన్ పాథాలజిస్ట్స్ ప్రెసిడెంట్ ఎమిలీ వోల్క్ ప్రకారం.. ఇలాంటి టెస్ట్‌లు కొవిడ్‌ 19ని నిర్దారించగలవు. కానీ అది డెల్టా, ఆల్ఫా లేదా ఓమిక్రాన్ వేరియంట్‌ అనేది గుర్తించడం కొంచెం కష్టమని చెప్పారు. అంతేకాదు ఇతర రకాల వైరస్‌ల కంటే Omicron గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పారు.

యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌లను గుర్తించడానికి అనేక కొత్తరకాల టెస్ట్‌లు వచ్చాయని పేర్కొంది. కాకపోతే ఇవి ఓమిక్రాన్ గుర్తించడానికి తక్కువ అవకాశం ఉందని పేర్కొంది. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్‌కి పరీక్షలు ఎలా స్పందిస్తాయో అధ్యయనం చేస్తున్నట్లు నిపుణులు తెలిపారు. అమెరికా అంటు వ్యాధి నిపుణుడు ఆంథోనీ ఫౌసీ ప్రకారం ఇంట్లో టెస్ట్‌ల ద్వారా ఓమిక్రాన్‌ను గుర్తించడం కొంచెం కష్టమే అని చెప్పారు.

పెన్షన్‌దారులు, బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. ఇప్పుడు ఈ పనులు చేయడానికి మార్చి వరకు అవకాశం..

Super Foods: చలికాలంలో ఇమ్యూనిటీ పెరగడానికి 10 సూపర్ ఫుడ్స్‌.. అవేంటంటే..?

కరోనా టైంలో పెరిగిన బ్యాడ్‌ హ్యాబిట్స్‌.. మద్యం, సిగరెట్లకు బానిసలైన యువత..