వారికి ఉద్యోగాలు ఇవ్వలేం.. మా వద్ద అలాంటి పాలసీ లేదు: దివ్యాంగ మహిళా ప్లేయర్‌కు షాకిచ్చిన పంజాబ్

వారికి ఉద్యోగాలు ఇవ్వలేం.. మా వద్ద అలాంటి పాలసీ లేదు: దివ్యాంగ మహిళా ప్లేయర్‌కు షాకిచ్చిన పంజాబ్
Deaf Women Chess Player Malika Handa

Malika Handa: ప్రపంచ, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో ఆరు పతకాలు సాధించింది. 2012 నుంచి ఆమె ఏడుసార్లు జాతీయ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.

Venkata Chari

|

Jan 03, 2022 | 7:02 AM

Malika Handa: భారతదేశానికి చెందిన దివ్యాంగ మహిళా చెస్ క్రీడాకారిణి మలికా హండా పంజాబ్ ప్రభుత్వం వాగ్దానాన్ని ఉల్లంఘించిందని, పంజాబ్ ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించింది. మలికా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక వీడియోను కూడా అప్‌లోడ్ చేసింది. దానితో ఒక పోస్ట్ కూడా రాసింది. పంజాబ్ ప్రభుత్వం తనకు ఉద్యోగం, నగదు పురస్కారం ఇస్తామని గతంలో ప్రకటించింది. కానీ, ప్రస్తుతం క్రీడా మంత్రి ఆ హామీని తుంగలో తొక్కారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను డిసెంబర్ 31న పంజాబ్ క్రీడా మంత్రిని కలిశానని, అయితే బధిరుల క్రీడలకు సంబంధించి ఎలాంటి పాలసీ లేనందున రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉద్యోగం, నగదు పురస్కారం ఇవ్వలేమని మంత్రి చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.

మాజీ క్రీడా మంత్రి తనకు నగదు పురస్కారం ఇస్తామని ప్రకటించారని, తన వద్ద ఆహ్వాన పత్రం కూడా ఉందని, అయితే కోవిడ్ కారణంగా ఈ ఆహ్వానం రద్దు చేశారని మలిక తెలిపింది. “నేను చాలా విచారంగా ఉన్నాను. డిసెంబర్ 31న పంజాబ్ క్రీడా మంత్రిని కలిశాను. బధిరుల క్రీడలకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వంలో ఎలాంటి విధానమూ లేనందున ఉద్యోగాలు, నగదు పురస్కారాలు ఇవ్వలేమని అన్నారు” అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది.

‘ఐదేళ్లు వృధా చేశాను’ “మాజీ క్రీడా మంత్రి నాకు నగదు అవార్డు ఇస్తామని అన్నారు. దానికి సంబంధించిన ఆహ్వాన లేఖ కూడా నా వద్ద ఉంది. అయితే కోవిడ్ కారణంగా ఈ ఆహ్వానం రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తుత క్రీడా మంత్రి పర్గత్ సింగ్‌కి చెప్పగా.. ఇది నేను కాదు మాజీ మంత్రి ప్రకటించారని అన్నారు. మరి ప్రభుత్వం అలాంటి పని చేయనప్పుడు, మరి ఎందుకు ప్రకటించారని అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో నా ఐదేళ్లు వృథా అయ్యాయి” అంటూ ఆగ్రహించింది.

కెరీర్.. మలిక చెవిటి, మూగ చెస్ క్రీడాకారిణి. అంతర్జాతీయ డెఫ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారతదేశం నుంచి తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె పేరుగాంచారు. ప్రపంచ, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో ఆరు పతకాలు సాధించింది. 2012 నుంచి ఆమె ఏడుసార్లు జాతీయ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.

Also Read: IND vs SA: ఆ‍యన రిటైర్మెంట్ షాకిచ్చింది.. మాజట్టుపై తీవ్ర ప్రభావం: దక్షిణాఫ్రికా కెప్టెన్, కోచ్ కీలక వ్యాఖ్యలు

IND vs SA: భారత్‌తో వన్డే సిరీస్‌కి జట్టుని ప్రకటించిన సౌతాఫ్రికా.. స్థానం సంపాదించిన కొత్త బౌలర్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu