మినీ సార్వత్రిక సమరాన్ని తలపిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. తాజాగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మీరట్‌లోని సర్ధనలో స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రధాని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన అనంతరం మోడీ మాట్లాడుతూ.. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘అక్రమ స్వాధీన’ టోర్నీలు ఆడేవారని అన్నారు. నేరగాళ్ల భయంతో ప్రజలు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడేదన్నారు. సాయంత్రం దాటినా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండేదని.. అంతలా నేరస్థులు విధ్వంసం సృష్టించారన్నారు. గత ప్రభుత్వాలు వారితో టోర్నమెంట్లను ఆడుతూ బిజీగా ఉండేవారన్నారు. యోగి ప్రభుత్వం వచ్చాక ఈ నేరస్తులంతా ఇప్పుడు ‘జైలు’లో ఆడుకుంటున్నారని సెటైర్లు సందించారు. నేడు రాష్ట్రం నుంచి నేరగాళ్ల వలసలు మొదలయ్యాయని అన్నారు.
ప్రజల్లో క్రీడల పట్ల గౌరవం కొరవడడంతో క్రీడాకారులు నిర్లక్ష్యానికి గురికావాల్సి వచ్చిందన్నారు. బానిసత్వంలో కూడా దేశ పతాకాన్ని రెపరెపలాడించిన హాకీని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ప్రపంచంలోని హాకీ మైదానం నుండి టర్ఫ్‌కు తరలించబడింది. హాకీ మాత్రమే కాదు ఇతర క్రీడలు కూడా అవినీతి, బంధుప్రీతితో ప్రభావితమయ్యాయి. 2014 తర్వాత ఆటగాళ్లకు వనరులు, అంతర్జాతీయ శిక్షణ, విదేశీ గుర్తింపు, ఎంపికలో పారదర్శకత అనే నాలుగు ఆయుధాలు ఇవ్వబడ్డాయి.
మీరట్ దేశంలోని మరో గొప్ప బిడ్డ మేజర్ ధ్యాన్ చంద్‌కు జన్మస్థలం అని ప్రధాని అన్నారు. కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద క్రీడా అవార్డుకు దద్దా పేరు పెట్టింది. నేడు మీరట్‌లోని ఈ క్రీడా విశ్వవిద్యాలయం మేజర్ ధ్యాన్ చంద్ జీకి అంకితం చేయబడింది.
పెద్దలు చూపిన బాటలో నడవాలని ఇంతకు ముందు చెప్పారని ఇప్పుడు యువత చూపిన బాటలో ప్రపంచమంతా నడవాల్సిన సమయం వచ్చిందన్నారు ప్రధాని మోడీ. మీరట్‌లో జరగబోయే రెజ్లింగ్ గొడవల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ఈ యూనివర్సిటీకి హాకీ మాంత్రికుడిగా ప్రసిద్ధి చెందిన మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. 700 కోట్లతో దాదాపు 92 ఎకరాల స్థలంలో ఈ యూనివర్సిటీని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని మోడీ రోడ్డు మార్గంలో మీరట్ చేరుకున్నారు. స్పోర్ట్స్ యూనివర్శిటీ శంకుస్థాపనకు ముందు మీరట్‌లోని కాళీ పల్టాన్ ఆలయంలో ప్రధాన మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీరట్‌లోని అమరవీరుల స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి: KTR: ఆదిలాబాద్‌లో సీసీఐను పున:ప్రారంభించండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
Mega Star Chiranjeevi: ‘అలాంటి పంచాయితీలు నేను చేయలేను’.. చిరు సంచలన వ్యాఖ్యలు