AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: భారత్‌తో వన్డే సిరీస్‌కి జట్టుని ప్రకటించిన సౌతాఫ్రికా.. స్థానం సంపాదించిన కొత్త బౌలర్..

IND vs SA: భారత్‌తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. జట్టు కమాండ్ టెంబా బావుమా చేతిలో ఉంటుంది, ఇటీవల టెస్టు క్రికెట్‌కు

IND vs SA: భారత్‌తో వన్డే సిరీస్‌కి జట్టుని ప్రకటించిన సౌతాఫ్రికా.. స్థానం సంపాదించిన కొత్త బౌలర్..
South Africa Odi Team
uppula Raju
|

Updated on: Jan 02, 2022 | 8:35 PM

Share

IND vs SA: భారత్‌తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. జట్టు కమాండ్ టెంబా బావుమా చేతిలో ఉంటుంది, ఇటీవల టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ కూడా జట్టులోకి వచ్చాడు. జనవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో అత్యంత ప్రత్యేకమైన పేరు 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మార్కో యాన్సన్. భారత్‌తో సెంచూరియన్ టెస్టులో అరంగేట్రం చేసిన ఈ పొడవాటి బౌలర్.. తొలిసారి వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే టెస్టు సిరీస్‌కు ముందు గాయపడిన తమ ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నోర్కియా లేకుండానే ఆఫ్రికన్ జట్టు ఈ సిరీస్‌లో రంగంలోకి దిగాల్సి ఉంటుంది.

దాదాపు ప్రధాన ఆటగాళ్లందరూ దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో జట్టులో ఉన్న వేన్ పార్నెల్, సిసంద మంగ్లా, జుబేర్ హమ్జా కూడా తమ స్థానాన్ని కాపాడుకోగలిగారు. కరోనా కారణంగా తొలి వన్డే తర్వాత ఆ సిరీస్ వాయిదా పడింది. అదే సమయంలో ఈ సిరీస్‌లో విరామం తీసుకున్న కెప్టెన్ బావుమా, క్వింటన్ డి కాక్, కగిసో రబాడ వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి వచ్చారు. ఈ సిరీస్ దక్షిణాఫ్రికాకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే దీని ద్వారా 2023లో జరిగే ODI ప్రపంచకప్‌కు అర్హత పాయింట్లను సాధించాలి.

డికాక్‌కి అవకాశం దక్కింది సెంచూరియన్ టెస్టులో భారత్‌తో ఓడిపోయి టెస్టు క్రికెట్‌కు గుడ్‌బాయ్‌ చెప్పిన 29 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. డి కాక్ తన రిటైర్మెంట్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆడటం కొనసాగిస్తానని ప్రకటించాడు. టెస్ట్ సిరీస్ మధ్యలో జట్టును విడిచిపెట్టినప్పటికీ పొట్టి ఫార్మాట్‌లలో అతను కీలక ఆటగాడు అని ఆఫ్రికన్ బోర్డు స్పష్టం చేసింది.

వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు టెంబా బావుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్, యనమాన్ మలన్, జుబైర్ హంజా, మార్కో యాన్సన్, సిసాండా మంగ్లా, ఐడాన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, వేన్ పార్నెల్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగి ప్రిటోరియస్ , తబ్రేజ్ శంబాడా , రాసి వాన్ డెర్ డస్సెన్, కైల్ వెరెన్.

అన్నదాతలకు శుభవార్త.. వ్యవసాయ రుణ లక్ష్యం పెంచే యోచనలో ప్రభుత్వం.. ఎంతమేరకంటే..?

హిజాబ్ ధరించినందుకు క్లాస్‌లోకి నో ఎంట్రీ.. ముస్లిం బాలికల ఆందోళన.. ఎక్కడంటే..?

Worshiping Trees: ఈ చెట్లలో దేవతలు నివసిస్తారట.. అందుకే పూజిస్తారట..? ఆ చెట్లు ఏంటంటే..