AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sourav Ganguly: డిశ్చార్జ్‌ అయ్యాక డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. దాదాను వదలనంటోన్న కరోనా..

Sourav Ganguly: కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఓవైపు ఇంకా డెల్టా వేరియంట్‌ కేసుల సంఖ్య కొనసాగుతున్న సమయంలోనే ఒమిక్రాన్‌ పంజా విసురుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం...

Sourav Ganguly: డిశ్చార్జ్‌ అయ్యాక డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. దాదాను వదలనంటోన్న కరోనా..
Narender Vaitla
|

Updated on: Jan 02, 2022 | 12:08 PM

Share

Sourav Ganguly: కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఓవైపు ఇంకా డెల్టా వేరియంట్‌ కేసుల సంఖ్య కొనసాగుతున్న సమయంలోనే ఒమిక్రాన్‌ పంజా విసురుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గత సోమవారం కాస్త అనారోగ్యంతో ఉన్న గంగూలీకి పరీక్షలు చేయించడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్‌ ఆసుపత్రిలో చేరారు.

ఒమిక్రాన్‌ పరీక్షలు నిర్వహించడంతో నెగిటివ్‌గా తేలింది. అనంతరం కరోనా నుంచి కోలుకున్న గంగూలీని వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు. అయితే పూర్తిగా కోలుకునేంత వరకు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే తాజాగా గంగూలికి వైద్యులు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు.  దీంతో మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈసారి నిర్వహించిన పరీక్షలో గంగూలీకి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఆందోళన చెందే స్థాయిలో లేకపోవడంతో ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు. మరో 15 రోజుల పాటు గంగూలీ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.

Also Read: India Corona: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Bangarraju : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటున్న కింగ్ నాగార్జున, నాగ చైతన్య “బంగార్రాజు” టీజర్

BheemlaNayak: దుమ్మురేపిన “లాలా భీమ్లా.. డిజే వెర్షన్.. సోషల్ మీడియాను షేక్ చేసిన పాట

వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు