India Corona: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అంతటా

India Corona: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Corona Cases
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 02, 2022 | 10:42 AM

India Coronavirus Updates: భారత్‌లో ఒమిక్రాన్‌ ఉధృతికి తెరపడడం లేదు. అటు కరోనా.. ఇటు ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 1,525కు చేరగా.. 27వేల 553 కరోనా కేసులు నమోదయ్యాయి. 284 మంది కరోనా మహమ్మారికి బలైనట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. ప్రస్తుతం దేశంలో 122801 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇక ఒమిక్రాన్‌ విషయానికొస్తే మహరాష్ట్రలోనే అత్యధికంగా 460 కేసులు ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో ఢిల్లీలో 351, గుజరాత్‌లో 136 కేసులు నమోదయ్యాయి. కేరళలోనూ ఒమిక్రాన్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అక్కడ ఇప్పటివరకు 109 కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 రాష్ట్రాలకు పాకింది ఒమిక్రాన్‌ మహమ్మారి.

తెలంగాణలో మరోసారి కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనాతో విలవిలాడుతున్న ప్రజలకు అది చాలదన్నట్లు ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వారంలోపే కేసులు రెట్టింపవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

మూడు వారాల క్రితం రాష్ట్రంలో తొలికేసు నమోదవగా.. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. ఒమిక్రాన్‌ ముప్పు పొంచిఉన్న దేశాల నుంచి వచ్చినవారిలోనే కాకుండా ఆ ముప్పు తక్కువున్న దేశాల నుంచి వచ్చిన వారికి సైతం ఒమిక్రాన్‌ నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే కమ్మూనిటీలోకి వెళ్లి ఉంటుందనే అనుమానాలకు తాజాగా నమోదవుతున్న కేసులు బలం చేకూరుస్తున్నాయి.

తెలంగాణలో కొత్తగా 12 మందికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. నిన్న విదేశాల నుంచి వచ్చిన 123 మందికి పరీక్షలు చేయగా.. వీరిలో 10 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ముగ్గురు ఒమిక్రాన్‌ ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చినవారు కాగా.. 9 మంది కరోనా ముప్పు తక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్‌ కేసుల్లో సాధారణ లక్షణాలైన జలుబు, జ్వరమే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం ఊపిరితిత్తులపై ఎక్కువగా లేదని చెబుతున్నారు. కరోనా, ఒమిక్రాన్‌ నిరోధానికి శానిటైజర్‌, భౌతికదూరం పాటించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఒమిక్రాన్‌ విస్తరణపై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఒమిక్రాన్‌ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆదేశించారు. తెలంగాణలో ఈనెల 10 వరకు ఆంక్షలు కొనసాగతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బహిరంగసభలు, ర్యాలీలపై నిషేధం విధించారు. మత, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం ప్రకటించారు. మాస్కును తప్పనిసరి చేశారు. మాస్కు ధరించనివారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని ఆదేశించారు సీఎస్‌.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మరణాల సంఖ్య దేశంలో 481770 కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 34284561 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.27 శాతం ఉంది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 145 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Dry Cough Remedies: పొడి దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే టిప్స్ పాటిస్తే వెంటనే ఉపశమనం..

US Shooting: అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ.. నూతన సంవత్సర వేడుకల్లో ముగ్గురు మృతి..

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??