AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Cough Remedies: పొడి దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే టిప్స్ పాటిస్తే వెంటనే ఉపశమనం..

Dry Cough Home Remedies: చలికాలం వచ్చిందంటే చాలా జలుబు, దగ్గు లాంటి సమస్యలు రావడం సర్వసాధారణం. దగ్గు.. శరీరంలో వాతం, పిత్తశాయం, కఫాల

Dry Cough Remedies: పొడి దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే టిప్స్ పాటిస్తే వెంటనే ఉపశమనం..
Dry Cough
Shaik Madar Saheb
|

Updated on: Jan 02, 2022 | 8:56 AM

Share

Dry Cough Home Remedies: చలికాలం వచ్చిందంటే చాలా జలుబు, దగ్గు లాంటి సమస్యలు రావడం సర్వసాధారణం. దగ్గు.. శరీరంలో వాతం, పిత్తశాయం, కఫాల అసమతుల్యత వస్తుంది. అయితే.. దగ్గు రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి శ్లేష్మంతో కూడిన దగ్గు, మరొకటి పొడి దగ్గు. శ్లేష్మంతో కూడిన దగ్గులో శ్లేష్మం గట్టిగా మారుతుంది. పొడి దగ్గులో గొంతులో నొప్పి, ఛాతీలో నొప్పి ఉంటుంది. దగ్గు పెరిగినప్పుడు పక్కటెముకల్లో కూడా నొప్పి వస్తుంటుంది. సకాలంలో చికిత్స చేయకపోతే.. అది కూడా టీబీకి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ రోజు మనం పొడి దగ్గును వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలను చెప్పబోతున్నాం. నిజానికి, పొడి దగ్గు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు కూడా ఏదైనా కారణం వల్ల పొడి దగ్గుతో ఇబ్బంది పడుతుంటే.. ఇక్కడ తెలిపిన కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే వెంటనే నయమవుతుంది. ఆ చిట్కాలు ఎంటో ఇప్పుడు తెలుసుకోండి.

ఉప్పు పుక్కిలించడం.. పొడి దగ్గుతో బాధపడుతుంటే.. ఉప్పు నీటితో పుక్కిలించడం ఉత్తమమైనది. గార్గ్లింగ్ పొడి దగ్గుకు మాత్రమే కాకుండా గొంతులో మంట, చికాకు లాంటి సమస్యలను తొలగిస్తుంది. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి సుమారు 10 నిమిషాల పాటు పుక్కిలించాలి. దగ్గు ఎక్కువగా ఉంటే రోజుకు 3 సార్లు పుక్కిలిస్తే.. ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

పసుపు పాలు పసుపులో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నివారణకు ఉత్తమమైనదని నిపుణులు పేర్కొంటున్నారు. పొడి దగ్గు సమస్య ఉన్న సమయంలో రాత్రిపూట గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది సహజసిద్ధమైన యాంటీబయాటిక్‌లా పనిచేస్తుంది.

తేనె పొడి దగ్గు చికిత్సకు తేనె ఉత్తమ చిట్కాల్లో ఒకటిగా పరిగణిస్తారు. బ్యాక్టీరియా వల్ల దగ్గు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాటిని నివారించడానికి తేనె అద్భుతంగా పనిచేస్తుంది. ఈ క్రిములను తొలగించే గుణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు కొంచెం తేనె తినాలి. ఇలా చేయడం వల్ల గొంతులో తేమ ఏర్పడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఆవిరి జలుబు లేదా దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఆవిరి పట్టడం ఉత్తమం. విపరీతమైన దగ్గు ఉన్నట్లయితే రోజుకు రెండు మూడు సార్లు ఆవిరి తీసుకోవాలి. ఇది గ్రేట్ హోం రెమెడీ. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Viral Video: ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. పక్షి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో

Shocking Video: ఆమ్లెట్‌ వేస్తుండగా గుడ్డులోంచి కోడిపిల్ల బయటికొచ్చింది..