AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: ఆమ్లెట్‌ వేస్తుండగా గుడ్డులోంచి కోడిపిల్ల బయటికొచ్చింది..

Shocking Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్నిభయంకరంగా ఉంటే

Shocking Video: ఆమ్లెట్‌ వేస్తుండగా గుడ్డులోంచి కోడిపిల్ల బయటికొచ్చింది..
Chicken Viral
uppula Raju
|

Updated on: Jan 01, 2022 | 7:17 PM

Share

Shocking Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్నిభయంకరంగా ఉంటే మరికొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి. ఇంకొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. ఏదిఏమైనప్పటికీ ఈ వీడియోలను నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తారు. తాజాగా ఒక వీడియో సోషల్‌ మీడియాని షేక్ చేస్తుంది. వీడియో చూస్తే మీరు కూడా పరేషాన్ అవుతారు. ఆమ్లెట్ వేస్తుండగా గుడ్డు నుంచి ఒక్కసారిగా కోడిపిల్ల బయటికి వస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఆ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం.

పాన్ మీద గుడ్డు పగలగొట్టిన తర్వాత అకస్మాత్తుగా కోడిపిల్ల బయటికి రావడాన్నిమీరు జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఒక హోటల్‌ నిర్వాహకుడు ఆమ్లెట్ చేయడానికి పాన్‌పై గుడ్డును పగులకొడుతాడు. వెంటనే కోడి గుడ్డు నుంచి కోడిపిల్ల బయటకు వచ్చి పాన్‌పై పరుగెత్తడం వీడియోలో గమనించవచ్చు. అయితే వెంటనే ఆమ్లెట్‌ తయారు చేసే వ్యక్తి ఆ కోడిపిల్లని తన చేతిలోకి తీసుకోవడం మనం చూడవచ్చు. దీంతో పాన్ వేడి నుంచి కోడిపిల్ల బతికి బయటపడుతుంది. ఈ సమయంలో చాలా మంది అక్కడ నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యపోతారు.

ఈ ఫన్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో robinhood_preet పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 48 వేల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. అయితే 1 వేయికి మందికి పైగా వీడియోను లైక్ చేసారు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ మనుషులను చూస్తుంటే ఇది భారతదేశంలోనే ఏదో ఒక ప్రదేశానికి సంబంధించిన వీడియో కావచ్చని తెలుస్తోంది. ఇలాంటి షాకింగ్ వీడియోలు భారతదేశంలో తరచుగా కనిపిస్తాయి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు.

ది గ్రేట్‌ ప్లేయర్.. విమర్శకుల నోళ్లు మూయించాడు.. మళ్లీ జట్టులో స్థానం సంపాదించాడు..

వెదురుబొంగుల చేపల కూర ఎప్పుడైనా తిన్నారా..! ఇక్కడ చాలా ఫేమస్.. ఒక్క వర్షకాలంలో మాత్రమే..?

IBPS PO Pre Exam Result 2021: ఐబీపీఎస్‌ పీవో ఫలితాలు ఎప్పుడంటే..?