AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBPS PO Pre Exam Result 2021: ఐబీపీఎస్‌ పీవో ఫలితాలు ఎప్పుడంటే..?

IBPS PO Pre Exam Result 2021: లక్షల మంది అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ప్రిలిమ్స్ పరీక్ష

IBPS PO Pre Exam Result 2021: ఐబీపీఎస్‌ పీవో ఫలితాలు ఎప్పుడంటే..?
Ibps Po
uppula Raju
|

Updated on: Jan 01, 2022 | 6:19 PM

Share

IBPS PO Pre Exam Result 2021: లక్షల మంది అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. PO ప్రిలిమ్స్ పరీక్ష 2021 డిసెంబర్ 4, 11 తేదీల్లో జరిగింది. నివేదిక ప్రకారం దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. IBPS PO ప్రిలిమ్స్ ఫలితాలు జనవరిలో వెలువడే అవకాశం ఉంది. ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ ibps.in సందర్శించగలరు.

IBPS PO ప్రిలిమ్స్ 2021 ఫలితం డిసెంబర్, 2021 నాలుగో వారంలో విడుదల అవుతాయని అందరు భావించారు. అయితే సంవత్సరం ముగుస్తున్నందున ఇప్పుడు ఈ ఫలితాలు జనవరి మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. IBPS PO ప్రిలిమ్స్ ఫలితాల కోసం అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్‌ను గమనించాలని సూచించారు. అయితే అధికారికంగా ఎలాంటి తేదీని బోర్డు ప్రకటించలేదు. జనవరిలో ఫలితాలు వెలువడవచ్చన్న ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. మెయిన్స్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

కేటగిరీ వారీ రిక్రూట్‌మెంట్‌లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) జారీ చేసిన నోటీసు ప్రకారం.. మొత్తం 4135 ఖాళీలు ఉన్నాయి. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 1600 సీట్లు కేటాయించారు. ఇది కాకుండా ఓబీసీ అభ్యర్థులకు 1102 సీట్లు, ఎస్సీ కేటగిరీకి 679 సీట్లు, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 350 సీట్లు, ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) కేటగిరీకి 404 సీట్లు కేటాయించారు. అభ్యర్థులందరు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

చలికాలంలో మడమల పగుళ్లు వేధిస్తున్నాయా..! ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందుతారు..

తులా రాశివారికి హెచ్చరిక.. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.. ఎందుకంటే..?

ఈ శ్రమ్‌ పోర్టల్‌లో మీ పేరు నమోదుచేసుకున్నారా.. ఈ 5 రాష్ట్రాల ప్రజలు ముందు వరుసలో ఉన్నారు..?