ఈ శ్రమ్‌ పోర్టల్‌లో మీ పేరు నమోదుచేసుకున్నారా.. ఈ 5 రాష్ట్రాల ప్రజలు ముందు వరుసలో ఉన్నారు..?

ఈ శ్రమ్‌ పోర్టల్‌లో మీ పేరు నమోదుచేసుకున్నారా.. ఈ 5 రాష్ట్రాల ప్రజలు ముందు వరుసలో ఉన్నారు..?
E Shram

E Shram Portal: అసంఘటిత రంగంలో పనిచేసే వ్యక్తులు నిరంతరం e-shram పోర్టల్‌లో చేరుతున్నారు. ఇప్పటివరకు 17 కోట్ల మంది కార్మికులు ఈ-శ్రమ్

uppula Raju

|

Jan 01, 2022 | 4:31 PM

E Shram Portal: అసంఘటిత రంగంలో పనిచేసే వ్యక్తులు నిరంతరం e-shram పోర్టల్‌లో చేరుతున్నారు. ఇప్పటివరకు 17 కోట్ల మంది కార్మికులు ఈ-శ్రమ్ కార్డ్ కోసం నమోదు చేసుకున్నారు. ఇది కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించడం ద్వారా మీ పేరుని నమోదు చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నవారిలో మహిళలే అధికంగా ఉండటం విశేషం. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి చాలా మంది కార్మికులు ఈ పోర్టల్‌లో చేరుతున్నారు.

ఉత్తరప్రదేశ్ కార్మికులు అత్యధికంగా నమోదు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో గరిష్ట సంఖ్యలో నమోదు చేసుకున్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, బీహార్ మూడో స్థానంలో, ఒడిశా నాలుగో స్థానంలో, జార్ఖండ్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పటివరకు 47.02 శాతం పురుషులు, 52.98 శాతం మహిళలు ఇందులో చేరారు. ఈ పోర్టల్‌లో చేరినవారు భవిష్యత్‌లో అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందగలరు.

ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఎలా నమోదు చేసుకోవాలి 1. e-shram కార్డ్ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం మీరు ముందుగా e-shram పోర్టల్ (eshram.gov.in) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. 2. దీని తర్వాత మీరు హోమ్ పేజీకి వెళ్లి రిజిస్టర్ ఆన్ ఈ-శ్రమ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి 3. దీని తర్వాత రిజిస్ట్రేషన్ ఫారమ్ న్యూ పేజీలో ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు మీ ఆధార్ కార్డ్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్, EPFO, ESIC సభ్యుల స్థితిని నమోదు చేయాలి. 4. ఈ ప్రక్రియ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు OTP పంపే ఎంపికను ఎంచుకోవాలి. 5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దానిని OTP బాక్స్‌లో టైప్ చేయాలి. 6. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపాలి. (ఏ పేరు, చిరునామా, జీతం, వయస్సు, మీకు సంబంధించిన ఇతర సమాచారం నమోదు చేయాలి) 7. పూర్తి ఫారమ్ నింపిన తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. చివరకు ఓకె బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు..! చాలా నష్టం భరించాల్సి ఉంటుంది..

OLED డిస్‌ప్లేతో లాంచ్‌కానున్న Moto G71.. ధర, స్పెసిఫికేషన్ గురించి తెలుసుకోండి

వన్డే జట్టులోకి వచ్చేశారు.. రోహిత్‌ స్థానంలో దేశవాళీ ఆటగాడు.. హార్దిక్‌ పాండ్యా స్థానంలో మరో ఆల్‌రౌండర్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu