వన్డే జట్టులోకి వచ్చేశారు.. రోహిత్‌ స్థానంలో దేశవాళీ ఆటగాడు.. హార్దిక్‌ పాండ్యా స్థానంలో మరో ఆల్‌రౌండర్..

వన్డే జట్టులోకి వచ్చేశారు.. రోహిత్‌ స్థానంలో దేశవాళీ ఆటగాడు.. హార్దిక్‌ పాండ్యా స్థానంలో మరో ఆల్‌రౌండర్..
Ruturaj And Venkatesh

Cricket News: దక్షిణాఫ్రికాలో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ గాయం వల్ల ఈ సిరీస్‌లో ఆడటంలేదు.

uppula Raju

|

Dec 31, 2021 | 10:14 PM

Cricket News: దక్షిణాఫ్రికాలో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ గాయం వల్ల ఈ సిరీస్‌లో ఆడటంలేదు. కాబట్టి కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. రోహిత్‌కి ప్రత్యామ్నాయంగా రాహుల్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు ఓపెనర్‌గా రోహిత్‌తో సమానమైన ఇన్నింగ్స్ ఆడగల యువ ఆటగాడికి అవకాశం ఇచ్చారు. దీంతో పాటు హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా కనిపించే మరో ఆల్ రౌండర్‌ను కూడా ఎంపిక చేశారు. రోహిత్ స్థానంలో ఎంపికైన ఆటగాడి పేరు రితురాజ్ గైక్వాడ్. ఈ సిరీస్‌లో అతను వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో పరుగుల వర్షం కురిపించిన రితురాజ్‌కు బహుమతి లభించింది. తన బ్యాటింగ్‌తో దిగ్గజాలను ఆకట్టుకున్నాడు.

దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టును ఎంపిక చేయడానికి ముందు భారత్ స్వదేశంలో జరిగే వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని నిర్వహించారు. ఈ టోర్నీలో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ రితురాజ్ పరుగుల వర్షం కురిపించాడు. అతను మహారాష్ట్ర తరపున ఆడాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. అతను ఐదు మ్యాచ్‌ల్లో 150.75 సగటుతో 603 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడు నాలుగు సెంచరీలు చేశాడు. విజయ్ హజారేలో రీతురాజ్ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. మధ్యప్రదేశ్‌పై 136, ఛత్తీస్‌గఢ్‌పై 154, కేరళపై 124 పరుగులు చేశాడు. అతను ఉత్తరాఖండ్‌పై 21 పరుగులు చేయగలిగాడు. అయితే చండీగఢ్‌పై 168 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. నిజానికి రీతురాజ్ జులైలో టీమ్ ఇండియా జెర్సీని ధరించాడు. శ్రీలంక టూర్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వెళ్లిన జట్టులో రితురాజ్ కూడా ఉన్నాడు కానీ అక్కడ అతను కేవలం T20 మాత్రమే ఆడగలిగాడు. భారత్ తరఫున ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో 35 పరుగులు మాత్రమే చేశాడు.

రితురాజ్ లాగానే వెంకటేష్ అయ్యర్ కూడా మొదటి IPL-2021లో సందడి చేసి ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ప్రతిభ కనబరిచాడు. అనంతరం దక్షిణాఫ్రికాలో జరిగే ODI సిరీస్‌లో టీమ్ ఇండియాలో చోటు సంపాదించాడు. అయ్యర్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. అతను లీగ్‌లో 10 మ్యాచ్‌లు ఆడాడు. 41.11 సగటుతో 370 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మూడు వికెట్లు కూడా తీశాడు. అందుకే ఫ్రాంచైజీ అతడిని తన వద్దే ఉంచుకుంది.

అయ్యర్ ఓపెనింగ్ సమయంలో ఈ పరుగులన్నీ చేసినప్పటికీ, టీమ్ ఇండియాలో, అతను నంబర్-5, 6లో ఆడటం చూడవచ్చు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో అయ్యర్ మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో మాత్రమే ఆడుతున్నట్లు కనిపించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బ్యాట్స్‌మెన్ విజయ్ హజారేలో ఆరు మ్యాచ్‌ల్లో 379 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. అతను బంతితో తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. టీమ్‌ ఇండియాలో హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఇతడిని ఎంపిక చేశారు.

Dates Chutney: ఖర్జూర చట్నీ ఎప్పుడైనా తిన్నారా..! శీతాకాలంలో అద్భుతం..

UPSC సివిల్ సర్వీసెస్ రిజర్వ్ జాబితా ఫలితాలు విడుదల.. 75 మంది అభ్యర్థుల ఎంపిక..

Airtel: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. న్యూ ఇయర్‌ ఆఫర్, డిస్కౌంట్ల గురించి తెలుసుకోండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu