Dates Chutney: ఖర్జూర చట్నీ ఎప్పుడైనా తిన్నారా..! శీతాకాలంలో అద్భుతం..

Dates Chutney: ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో దీని వినియోగం చాలా ఆరోగ్యకరమైనది. అందుకే వైద్య నిపుణులు

Dates Chutney: ఖర్జూర చట్నీ ఎప్పుడైనా తిన్నారా..! శీతాకాలంలో అద్భుతం..
Date
Follow us
uppula Raju

|

Updated on: Dec 31, 2021 | 9:58 PM

Dates Chutney: ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో దీని వినియోగం చాలా ఆరోగ్యకరమైనది. అందుకే వైద్య నిపుణులు చలికాలంలో మాత్రమే ఖర్జూరాన్ని తినమని సలహా ఇస్తారు. అయితే కొంతమందికి ఇష్టముంటుంది మరికొంతమందికి నచ్చదు. ఇలాంటి సమయంలో ఇందులో ఉండే పోషకాలు లభించాలంటే ఖర్జూరతో చేసిన వంటకాలు తింటే సరిపోతుంది. ఖర్జూరంతో చేసే వంటకాల గురించి తెలుసుకుందాం.

1. ఖర్జూరం చట్నీ కావలసిన పదార్థాలు.. 1. ఖర్జూరం – 100 గ్రాములు 2. ఎర్ర కారం – 1/2 tsp 3. జీలకర్ర పొడి – 1/2 tsp 4. బ్లాక్ సాల్ట్ – 1/2 tsp 5. డ్రై ఫ్రూట్స్ – 2 tsp 6. ఉప్పు – రుచి ప్రకారం

ఎలా చేయాలి..? దీన్ని చేయడానికి ముందుగా ఖర్జూరం నుంచి గింజలను తీసివేసి మూడు కప్పుల నీటిలో సుమారు 2 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఖర్జూరాలను నీటిలో నుంచి తీసి వాటిని ఒక పాత్రలో ఉంచి బాగా ఉడికించాలి. ఖర్జూరాలు ఉడికిన తర్వాత మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత కారం, ఎండుమిర్చి, జీలకర్ర పొడి వంటివి వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్, వైట్ సాల్ట్ వేసి కలపాలి.

2. ఖర్జూరం పాయసం కావలసిన పదార్థాలు.. 1. ఖర్జూరం – 1 కప్పు 2. పాలు – 2 కప్పులు 3. నెయ్యి – 1 tsp 4. ఎండుద్రాక్ష – 1 tsp 5. యాలకుల పొడి – 1/2 tsp 6. జీడిపప్పు – 6

ఎలా చేయాలి..? ముందుగా ఖర్జూరాలను మెత్తగా కోసి తర్వాత పాన్‌లో పాలు మరిగించి మరో కడాయిలో నెయ్యి వేసి వేడయ్యాక ఖర్జూరం వేసి బాగా వేయించి తీయాలి. తర్వాత అదే బాణలిలో ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేయించి అందులో ఖర్జూరంతో పాటు పాలు కూడా వేసి బాగా ఉడికించాలి. ఖర్జూరం గుజ్జు అయ్యాక అందులో కొన్ని నీళ్లు పోసి యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి.

3. ఖర్జూరం పుడ్డింగ్ కావలసిన పదార్థాలు 1. ఖర్జూరం – 100 గ్రాములు 2. నెయ్యి – 1/2 కప్పు 3. జీడిపప్పు – 2 టీస్పూన్లు 4. వేడినీరు – 1/2 కప్పు 5. పంచదార – 2 టీస్పూన్లు 6. యాలకుల పొడి – 1/2 స్పూన్ 7. పాలు – 1/2 కప్పు

ఎలా చేయాలి..? ఖర్జూరాలను మెత్తగా కోసి, వాటిని నీటిలో సుమారు 10 నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బాణలిలో పాలు బాగా మరిగించి అందులో ఖర్జూరం వేయాలి. తర్వాత మిగిలిన పదార్థాలను కూడా కలపాలి. మధ్యలో కాస్త నెయ్యి వేయాలి. పుడ్డింగ్ బంగారు రంగులోకి మారినప్పుడు దానిని బయటకు తీస్తే అయిపోతుంది.

Weight Loss Tips: పరగడుపుతో గ్రీన్ టీ తాగడం మంచిదా.. కాదా? నిపుణులేమంటున్నారంటే?

Home Hints: బ్యాచిలర్స్‌‌కు గుడ్‌న్యూస్.. వంట మాడిపోయి తంటాలు పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Health Tips: లైంగిక శక్తిని పెంచడంలో ఈ ఫుడ్స్ అద్భుతంగా పని చేస్తాయి.. అవేంటంటే..!