Health Tips: లైంగిక శక్తిని పెంచడంలో ఈ ఫుడ్స్ అద్భుతంగా పని చేస్తాయి.. అవేంటంటే..!

Health Tips: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో.. చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే.. దాంపత్య జీవితం అస్తవ్యస్తంగా మారుతోంది.

Health Tips: లైంగిక శక్తిని పెంచడంలో ఈ ఫుడ్స్ అద్భుతంగా పని చేస్తాయి.. అవేంటంటే..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 29, 2021 | 9:23 PM

Health Tips: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో.. చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే.. దాంపత్య జీవితం అస్తవ్యస్తంగా మారుతోంది. లైంగిక కోరికలు తగ్గిపోవడం, దంపతుల మధ్య దూరం పెరగడం.. చివరికి విడాకులకు దారి తీయడం జరుగుతుంది. ఆరోగ్య నిపుణులు.. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే లైంగిక శక్తి రెట్టిస్తుందని చెబుతుండటం మనం వింటుంటాం. అయితే, ఇందులో నిజమెంత అని ఆరా తీస్తే.. డైటీషియన్స్ కీలక వివరాలు తెలిపారు. మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా లైంగిక సామర్థ్యం పెరుగుదలపై ప్రభావం చూపుతాయట. ముఖ్యంగా పలు రకాల ఆహార పదార్థాలు తింటే.. లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు.

1. స్ట్రాబెర్రీలు: లైంగిక సామర్థ్యం పెంచే ఫుడ్స్‌లో పురాతన కాలం నుండి స్ట్రాబెర్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని వీనస్ దేవత చిహ్నంగా సూచిస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పండ్లను నూతన వధువరులకు బహుమతిగా ఇస్తారు. కానీ, ఈ పండ్లలో సంతానోత్పత్తిని మెరుగుపరిచే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌ కలిగి ఉంటాయి. ఈ మూలకాలు వ్యక్తుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి.

2. అత్తిపండ్లు: అంగస్తంభన లక్షణాలకు అత్తి పండ్లను దివ్యౌషధంగా పేర్కొంటారు. అనేక అధ్యయనాల్లోనూ ఇది రుజువైంది. పునరుత్పత్తి ఆరోగ్యం, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడే అవసరమైన పోషకాలను అంజీర్‌లో పుష్కలంగా ఉన్నాయి.

3. అవకాడో: అవోకాడోను కామోద్దీపన పండు అని కూడా అంటారు. గుడ్డు ఆకారంలో ఉండే పండులో బీటా కెరోటిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి లైంగిక శక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

4. దానిమ్మ: అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షణను అందించే ఒక సూపర్ ఫుడ్. ఇందులో లైంగిక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

5. బీన్స్, కాయధాన్యాలు: బీన్స్, ముఖ్యంగా బ్లాక్ బీన్స్, కాయధాన్యాలలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. బీన్స్‌లో ప్రత్యేకంగా ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

Also read:

Telangana: తెలంగాణకు వెల్లువలా పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న అమూల్‌..

Corona Virus: శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్‌లో కరోనా కలకలం… 34 మంది విద్యార్థులకు కరోనా.. ఆందోళనలో తల్లిదండ్రులు

TRS Group War: పాలేరు గులాబీలో ముదురుతున్న వార్.. తుమ్మల వర్సెస్ కందాల.. అసలు కథ ఇదే..