Telangana: తెలంగాణకు వెల్లువలా పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న అమూల్‌..

తెలంగాణ ఐపాస్‌ విధానంపై పారిశ్రామికవేత్తల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అదే..

Telangana: తెలంగాణకు వెల్లువలా పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న అమూల్‌..
Babubhai M Patel
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 29, 2021 | 9:04 PM

తెలంగాణ ఐపాస్‌ విధానంపై పారిశ్రామికవేత్తల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అదే కోవలో తెలంగాణలో ఇన్వెస్ట్‌ చేసేందుకు డెయిరీ రంగంలో దిగ్గజ కంపెనీ అమూల్‌ ముందుకొచ్చింది. తెలంగాణ ఐపాస్‌ పాలసీకి ఆకర్షితులై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. తాజాగా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు అమూల్‌ కంపెనీ ముందుకొచ్చింది. 500 కోట్ల రూపాయలతో తెలంగాణలో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు అమూల్ కంపెనీ తెలిపింది. మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన అమూల్ ప్రతినిధి బృందం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని సైతం కుదుర్చుకుంది.

తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన అమూల్ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ఘనస్వాగతం పలికారు. తెలంగాణలో మరో శ్వేత విప్లవం ప్రారంభమైందన్నారు మంత్రి కేటీఆర్‌. దిగ్గజ కంపెనీ అమూల్ పెట్టుబడులకు తెలంగాణను ఎంచుకోవడమే అందుకు నిదర్శనమన్నారు మంత్రి కేటీఆర్‌. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని అమూల్‌ ప్రతినిధులకు మంత్రి స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలోనే తొలి డెయిరీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న కంపెనీకి మంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో ప్లాంటు ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకోవడంపై అమూల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ సోథి హర్షం ప్రకటించారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న అమూల్‌ డెయిరీ ప్లాంటుతో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా వేలమందికి ఉపాధి కలుగనుంది. రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ప్లాంటు తెలంగాణలో ఏర్పాటు చేస్తుండడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే సంస్థ ఏర్పాటు కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు అమూల్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: Fire Breaks: గయా రైల్వే జంక్షన్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రైలు..

CSIR UGC NET Exam 2021: CSIR UGC NET పరీక్ష వాయిదా.. కొత్త తేదీని ఇక్కడ చూడండి..