Gold Price Today: బంగారం ప్రియులకు సదవకాశం.. భారీగా తగ్గిన గోల్డ్ ధరలు. ఈ రోజు తులం రేట్ ఎంతుందంటే..
Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు, తగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ భయాలు, మార్కెట్లో మారుతోన్న పరిణామాలు వెరసి బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు, తగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ భయాలు, మార్కెట్లో మారుతోన్న పరిణామాలు వెరసి బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా భారీగా తగ్గాయి. ఏకంగా రూ. 200కిపైగా తగ్గి. బంగారం కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి అవకాశంగా మారింది. గురువారం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 వద్ద ఉంది.
* ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో మాత్రం పెరిగి రూ.49,010 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,270 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,390 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260 వద్ద కొనసాగుతోంది.
* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260 వద్ద కొనసాగుతోంది.
Also Read: TOP 9 Entertainment: లైగర్ గింప్స్‌కు డేట్ ఫిక్స్ | భీమ్లా నాయక్ న్యూ ఇయర్ గిఫ్ట్.. (వీడియో)
Sudigali Sudheer: నాకు దూరంగా ఉండూ.. సుధీర్‌కు కౌంటర్ వేసిన హీరోయిన్..
TRS: పీక్‌స్టేజ్‌లో పినపాక గులాబీ ముసలం.. రేగా, పాయం మధ్య అంతర్యుద్ధం..