AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS: పీక్‌స్టేజ్‌‌లో పినపాక గులాబీ ముసలం.. రేగా, పాయం మధ్య అంతర్యుద్ధం..

రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. కానీ ఖమ్మం జిల్లా పాలిటిక్స్‌మాత్రం TRSకు మింగుడుపడటం లేదు. వర్గపోరు, గ్రూపు రాజకీయాలతో ప్రస్తుతం పార్టీ అత్యంత బలహీనంగా మారింది..

TRS: పీక్‌స్టేజ్‌‌లో పినపాక గులాబీ ముసలం.. రేగా, పాయం మధ్య అంతర్యుద్ధం..
Pinapaka Assembly Constitue
Sanjay Kasula
|

Updated on: Dec 29, 2021 | 8:20 PM

Share

రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. కానీ ఖమ్మం జిల్లా పాలిటిక్స్‌ మాత్రం TRSకు మింగుడుపడటం లేదు. వర్గపోరు, గ్రూపు రాజకీయాలతో ప్రస్తుతం పార్టీ అత్యంత బలహీనంగా మారింది. అక్కడే ఎందుకీ పరిస్థితి? ఖమ్మం గులాబీకి ఏడేళ్లుగా అదే శని ఎందుకు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం ఐదు చోట్ల TRS వర్గపోరు పీక్‌స్టేజ్‌కు చేరింది. పినపాకలో ఇప్పటికే అంతర్యుద్ధం మొదలైంది. ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మ్యాటర్ ఇప్పటికే సోషల్‌ మీడియాకు ఎక్కింది. వచ్చే ఎన్నికల్లో ఆ మాజీ ఎమ్మెల్యేతోనే మనకు పోటీ అన్న రేగా కాంతారావు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 2018లో కారు గుర్తుపై పోటీ చేసిన ఓడిపోయినా మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, హస్తం గుర్తుపై గెలిచి కారెక్కిన తాజా ఎమ్మెల్యే రేగా కాంతారావు మధ్య జరుగుతున్న అంతర్గత పోరు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది.

2023 కోసం ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నారు రేగా కాంతారావు. మైండ్ గేమ్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీ మారుతున్నారు అంటూ పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు నేతల తీరుతో కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇటీవల జరిగిన MLC ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడానికి పాయం వెంకటేశ్వర్లే కారణం అంటూ తన అనుచరుల వద్ద ప్రస్తావించారు రేగా.

కమ్యూనిస్టు పార్టీలో ఓనమాలు దిద్ది.. నాయకుడుగా ఎదిగిన పాయం వెంకటేశ్వర్లు ఆ తర్వాత YCP తీర్థం పుచ్చుకుని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడిగా మారాడు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన పాయం అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు TRSలో చేరాడు. 2018లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన రేగా కాంతారావు చేతిలో ఓటమి పాలయ్యాడు పాయం వెంకేశ్వర్లు.

ఆ తర్వాత రేగా గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. నియోజకవర్గంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత తన మార్క్ రాజకీయం చూపించాడు. పాయం వెంకటేశ్వర్లు అనుచరులకు ఎక్కడా పదవులు రాకుండా అడ్డుకున్నాడన్న విమర్శలున్నాయి. పాయం వెంకటేశ్వర్లు సతీమణి ప్రమీలను కాదని మహిళకు ఎంపీపీ పదవి కట్టబెట్టడంతో విబేధాలు తార స్థాయికి చేరాయి.

కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న పాయం వెంకటేశ్వర్లు క్రమంగా దూకుడు పెంచుతూ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. తనపై సోషల్ మీడియా వేదికగా రేగా కాంతారావు చేసిన ప్రకటనను ఖండించారు. అలా ఎన్నికలకు రెండేళ్ల ముందే పినపాకలోరాజకీయం వేడెక్కింది..

ఇవి కూడా చదవండి: TRS Group War: ఖమ్మం గులాబీ దళంలో గలాట.. క్రాస్ ఓటింగ్ కట్టప్పలు ఎవరన్నదే ఇక్కడ సస్పెన్స్..