AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS Group War: ఖమ్మం గులాబీ దళంలో గలాట.. క్రాస్ ఓటింగ్ కట్టప్పలు ఎవరన్నదే ఇక్కడ సస్పెన్స్..

ఖమ్మం గుమ్మంలో లొల్లి. గులాబీదళంలో గలాట. సగానికిపైగా నియోజకవర్గాల్లో గ్రూప్‌వార్. 2018లో ఇదే వర్గపోరు పార్టీని ఘోరంగా దెబ్బతీసింది. మూడేళ్ల తర్వాత కూడా సేమ్‌ సిట్యుయేషన్ కనిపిస్తోంది. పరిస్థితి ఇప్పటికీ మారలేదు.

TRS Group War: ఖమ్మం గులాబీ దళంలో గలాట.. క్రాస్ ఓటింగ్ కట్టప్పలు ఎవరన్నదే ఇక్కడ సస్పెన్స్..
Khammam Trs Party
Sanjay Kasula
|

Updated on: Dec 29, 2021 | 7:21 PM

Share

ఖమ్మం గుమ్మంలో లొల్లి. గులాబీదళంలో గలాట. సగానికిపైగా నియోజకవర్గాల్లో గ్రూప్‌వార్. 2018లో ఇదే వర్గపోరు పార్టీని ఘోరంగా దెబ్బతీసింది. మూడేళ్ల తర్వాత కూడా సేమ్‌ సిట్యుయేషన్ కనిపిస్తోంది. పరిస్థితి ఇప్పటికీ మారలేదు. పద్ధతులూ కూడా మారలేదు. ఇటీవలి MLC ఎన్నికల్లో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. క్రాస్‌ఓటింగ్ జరిగింది. సీఎం కేసీఆర్ కూడా ఈ ఇష్యూపై సీరియస్ అయ్యారు. ఆ ఇంటి దొంగలెవరో తేల్చాలన్నారు. ఇంతకీ ఖమ్మం టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? అందరిదీ ఒకే మాట..! పార్టీలో కుట్ర జరుగుతోంది.! గ్రూప్‌ రాజకీయాలు నడుస్తున్నాయి.! ఒకచోట ఉండి మరోచోట కాపురం చేస్తే ఎలా? ఏడేళ్లుగా ఇదే చెబుతున్నారు. పార్టీలో ఏదో జరుగుతోందంటున్నారు.! ఇప్పటికైనా కలిసికట్టుగా నడవాలి అంటున్నారు. అంతే మ్యాటర్ అక్కడే ఆగిపోతోంది. అడుగు ముందుకు పడటం లేదు.. ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ సేమ్‌ సీన్. అవే విబేధాలు, అదే వర్గపోరు. ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. పార్టీ పరువుని బజారుకీడుస్తున్నారు.. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఇప్పుడు బహిర్గతమవుతోంది.

TRS నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. వాస్తవానికి భారీ మెజారిటీతో గెలవాలని టీఆర్ఎస్ స్కెచ్ వేసింది. గోవాలో క్యాంపులు కూడా నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ బలం 116.. కానీ 240కిపైగా ఓట్లు రావడంతో టీఆర్ఎస్ ఒక్కసారిగా షాక్‌ తింది. పార్టీ అభ్యర్థి తాతా మధు గెలిచినా.. క్రాస్‌ ఓటింగ్‌ మాత్రం మింగుడుపడని అంశంగా మారింది.

క్రాస్ ఓటింగ్ జరగడానికి కారణాలు ఏంటి? ఏయే నియోజకవర్గాల నుంచి ఎక్కువగా జరిగింది? అన్న ఇన్ఫోను నిఘా వర్గాల నుంచి తెప్పించుకుంది పార్టీ హైకమాండ్. వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూని CM కేసీఆర్ సీరియస్‌గా పరిగణిస్తున్నారు.

ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేలు ఎవరు? వారిని నడిపించిన నాయకుడు ఎవరు అన్నది ఆరా తీశారు. ఇప్పటికే పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధిపై ఫిర్యాదులు వెళ్లాయి. మరి హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఇటీవల టీఆర్ఎస్ నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా జిల్లాలో ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారాయి. ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కట్టప్పల భయం ఎక్కువైంది. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వెన్నుపోటు పొడుస్తారో తెలియని పరిస్థితి. 2018లోనూ ఇలాంటి వెన్నుపోట్లే పార్టీ కొంప ముంచాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే.. చావుతప్పికన్నులొట్టబోయినట్లు ఒకే ఒక్క సీటు గెలిచింది.

ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ మాత్రమే గెలిచారు. మిగిలిన తొమ్మిది చోట్ల టీఆర్ఎస్ ఘోర ఓటమి చవిచూసింది. ఆ తర్వాత నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర్య అభ్యర్థి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే ఒక్క చోటే గెలిచినా ఇప్పుడు పార్టీ బలం మాత్రం 8కి చేరింది. ఇదిగో ఇక్కడే వస్తోంది అసలు సమస్య.

ఎవరూ బయటపడకపోయినా.. బహిరంగంగా చెప్పకపోయినా అందరి వేళ్లూ ఒకరివైపే వెళ్తున్నాయి..గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు, కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లో TRS పరాభవానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమంటూ ఓడిపోయిన అభ్యర్థులు ఇప్పటికే హైకమాండ్‌కు కంప్లైంట్ చేశారు. 2014లో ఖమ్మం నుంచి YCP MPగా గెలిచారు పొంగులేటి శ్రీనివాస్.

ఆ తర్వాత గులాబీ కండువ కప్పుకున్నారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటికి కాకుండా అనూహ్యంగా నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్. పొంగులేటికి రాజ్యసభ సీటు కూడా దక్కలేదు. అప్పటి నుంచి జిల్లాలో పర్యటిస్తూ.. తనకంటూ పొంగులేటి ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఇంతా జరుగుతున్నా హైకమాండ్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోందన్నది సస్పెన్స్‌గా మారింది.

ఇవి కూడా చదవండి: Fire Breaks: గయా రైల్వే జంక్షన్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రైలు..

CSIR UGC NET Exam 2021: CSIR UGC NET పరీక్ష వాయిదా.. కొత్త తేదీని ఇక్కడ చూడండి..