Fire Breaks: గయా రైల్వే జంక్షన్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రైలు..
బీహార్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గయా రైల్వే జంక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌లో నిలిపిన రైలు బోగీలో భారీ మంటలు చెలరేగాయి. ఓ బోగీలో..
Fire Breaks: బీహార్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గయా రైల్వే జంక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌లో నిలిపిన రైలు బోగీలో భారీ మంటలు చెలరేగాయి. ఓ బోగీలో మొదట ప్రారంభమైన మంటలు నెమ్మదిగా అన్ని బోగీలకు వ్యాపించాయి. అయితే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ వ్యక్తి.. స్టాండింగ్‌యార్డ్‌లో ఉన్న రైలు బోగీలో మంటలను గమనించి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు.
అయితే మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బోగీలు చాలా వరకు మంటలకు కాలిపోయాయి. 20 బోగీల్లోని ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఎప్పుడు రద్దీగా ఉండే గయా రైల్వే జంక్షన్‌లో ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. ఎవరైనా దుండగులు కావాలనే ఇలా చేసివుంటారా.. లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇలా జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి: CSIR UGC NET Exam 2021: CSIR UGC NET పరీక్ష వాయిదా.. కొత్త తేదీని ఇక్కడ చూడండి..
TS BJP: మిషన్-19..! తెలంగాణ బీజేపీ కొత్త టార్గెట్.. విజయమే లక్ష్యంగా బండి సంజయ్ ప్లానింగ్