AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: మార్పు అందుకే చేశాం.. ప్రధాని కొత్త కారుపై కీలక వివరాలు వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు

PM Modi's Bullet Proof Car: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేంజ్‌ రోవర్‌ నుంచి మెర్సిడెజ్‌ మేబ్యాక్‌కు మారడంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ప్రధాని కాస్ట్లీ కారుకు సంబంధించి

PM Narendra Modi: మార్పు అందుకే చేశాం.. ప్రధాని కొత్త కారుపై కీలక వివరాలు వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు
Pm Modi Car
Shaik Madar Saheb
|

Updated on: Dec 29, 2021 | 3:04 PM

Share

PM Modi’s Bullet Proof Car: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేంజ్‌ రోవర్‌ నుంచి మెర్సిడెజ్‌ మేబ్యాక్‌కు మారడంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ప్రధాని కాస్ట్లీ కారుకు సంబంధించి కొందరు విమర్శలు కూడా చేస్తున్నారని..అందుకే ఈ అంశంపై స్పష్టత ఇస్తున్నట్టు వెల్లడించాయి. ఆ కొత్త కారును ప్రధాని ఎంచుకోలేదని.. అది అప్‌గ్రేడ్ కాదని, రొటీన్‌ రీ ప్లేస్‌మెంటేనని క్లారిటీ ఇచ్చింది కేంద్రం. గ‌తంలో వాడిన బీఎండబ్ల్యూ మోడల్‌ను ఆ సంస్థ త‌యారు చేయ‌డం లేద‌ని, అందుకే కొత్త కార్లను తీసుకున్నట్లు వెల్లడించాయి. ప్రధాని భద్రత స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ చూసుకుంటుందని.. ఎవరికైతే రక్షణ కల్పిస్తున్నారో వారి అభిప్రాయం తీసుకోకుండానే భద్రతా కారణాలతో ఎస్పీజీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టత నిచ్చాయి.

దీంతోపాటు ఆ కారు ధ‌ర‌పై వ‌స్తున్న ఊహాగానాల‌కు కూడా తెర‌దించే ప్రయ‌త్నం చేశాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఆ కారు ధర 12కోట్లు కాదని.. అందులో మూడ‌వ వంతు ఉంటుంద‌ని తెలిపాయి. ప్రధానికి ర‌క్షణ క‌ల్పిస్తోన్న స్పెష‌ల్ ప్రొటెక్షన్ గ్రూప్.. ఆరేళ్లకోసారి ప్రధాని వాహ‌నాల‌ను మార్చేస్తుంది. కానీ ప్రధాని మోదీ త‌న పాత కార్లను ఎనిమిదేళ్ల వ‌ర‌కు వినియోగించారని తెలిపారు. ప్రధాని సెక్యూరిటీకి సంబంధించిన ఆడిట్‌ సమయంలో.. ఈ అంశం ప్రస్తావ‌న‌కు రావ‌డంతో ఆందోళ‌న వ్యక్తమైంది. అందుకే ప్రధాని భ‌ద్రత‌ను పెంచాల‌ని భావించినట్లు వెల్లడించాయి. పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ప్రధాని కోసం ఎస్పీజీ వాహ‌నాల‌ను తీసుకుంటుంద‌ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని కాన్వాయ్‌లో చేరిన కొత్త కారును ఎలాంటి పేలుళ్లనైనా తట్టుకునేలా డిజైన్‌ చేశారు. అలాగే టైర్లు పంక్చరైనా దూసుకెళ్లే రీతిలో ఫ్లాట్‌ టైర్లను ఫిక్స్‌ చేశారు.

దీంట్లో 6 లీట‌ర్ల ట్విన్ ట‌ర్బో వీ12 ఇంజిన్‌ను వాడుతున్నట్లు పేర్కొన్నారు. టాప్ స్పీడ్‌ను 160 కిలోమీట‌ర్ల వేగానికి ప‌రిమితం చేసినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కారు బాడీ, విండోస్.. బుల్లెట్లు, పేలుళ్లను తట్టుకోగల గట్టి ఉక్కు కోర్‌తో డిజైన్ చేశారు. 2 మీటర్ల దూరంలో 15కేజీల టీఎన్టీ బ్లాస్ట్ జరిగినా.. ప్రొటెక్ట్ చేయగలదు ఈ కారు. అంతే కాదు. దీని బాడీ డైరెక్ట్ ఎక్స్ ప్లోజన్ నుంచి కూడా రక్షిస్తుంది. క్యాబిన్​​లో ప్రత్యేకంగా ఆక్సిజన్​ సిలిండర్లు ఉంటాయి. గ్యాస్ అటాక్ జరిగితే కారులో సపరేట్ ఎయిర్ సప్లై కూడా అరేంజ్ చేశారు.

ఈ కారు 6.0- లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజన్‌తో వస్తుంది. ఇది 516 BHP పవర్ 900 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెజ్‌ మేబ్యాక్​ S650 గార్డ్ ఫ్యుయల్​ ట్యాంక్ ఒక ప్రత్యేక కోటింగ్​తో వస్తుంది. బోయింగ్ ఏహెచ్​-64 అపాచీ హెలికాప్టర్లలో ఉపయోగించే కోటింగ్​ను ఉపయోగించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG).. దేశాధినేతల భద్రతను చూసుకుంటుంది. వారి సెక్యూరిటీ రీజన్స్‌ను పరిగణనలోకి తీసుకొని దేశాధినేతకు వాహనాన్ని అప్‌గ్రేడ్ చేయాలా వద్దా అనేది SPG నిర్ణయిస్తుందని అధికారవర్గాలు వెల్లడించాయి.

Also Read:

Balineni Srinivasa Reddy: టీడీపీలో చేరడం చారిత్రక తప్పిదం.. వంగవీటిపై మంత్రి బాలినేని కామెంట్స్

Direct sales: ఆమ్‎వే, టప్పర్‎వేర్‎కు కేంద్రం షాక్.. డైరెక్ట్ సేల్స్‎పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం..