TRS Group War: రాములు వర్సెస్ మదన్ లాల్.. హీటెక్కిన వైరా వైరం.. ఆయన సపోర్ట్‌తోనే..

వైరా నియోజకవర్గం చూస్తే.. ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మధ్య కోల్డ్ వార్ చినికి చినికి గాలివానగా మారుతోంది. ఒక ఒరలో రెండు కత్తులున్నట్లుగా తయారయింది సిట్యుయేషన్.

TRS Group War: రాములు వర్సెస్ మదన్ లాల్.. హీటెక్కిన వైరా వైరం.. ఆయన సపోర్ట్‌తోనే..
Wyra Constituency
Follow us

|

Updated on: Dec 29, 2021 | 8:43 PM

వైరా నియోజకవర్గం చూస్తే.. ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మధ్య కోల్డ్ వార్ చినికి చినికి గాలివానగా మారుతోంది. ఒక ఒరలో రెండు కత్తులున్నట్లుగా తయారయింది సిట్యుయేషన్. ఎవరి వైపు ఉండాలో తెలియక అయోమయానికి గురవుతున్నాయి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన రాములు నాయక్ తర్వాత గులాబీ కండువ కప్పుకున్నారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు విస్తృత ప్రయత్నం చేస్తున్నాడు. TRS నుంచి పోటీ చేసి ఓడిపోయిన మదన్ లాల్ సైతం గత 2 నెలలుగా దూకుడు పెంచారు. మరోసారి TRS పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ పంచాయితీ హైకమాండ్ వద్దకు చేరింది.

2014లో మదన్ లాల్ YCP తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి TRSలో జాయిన్ అయ్యారు. కొంతకాలం తర్వాత పొంగులేటితో విభేదించి వైరా నియోజకవర్గంలో తన అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2018లో TRS నుంచి పోటీ చేశాడు. కాంగ్రెస్ టికెట్ ఆశించారు రాములు నాయక్. కానీ మహా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ CPIకి టికెట్ ఇచ్చింది.

దీంతో రాములు నాయక్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడు. పరోక్షంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండదండలు అందించడంతో విజయం సాధించాడు. అనంతరం పొంగులేటి రాములు నాయక్‌ను సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేర్పించాడు. అప్పటి నుంచి కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న వైరా రాజకీయాలు ఇప్పడు మళ్లీ హీటెక్కాయి. మదన్‌లాల్‌ స్పీడ్ పెంచడంతో వర్గపోరు మళ్లీ మొదటికి వచ్చింది.

ఇవి కూడా చదవండి: TRS Group War: ఖమ్మం గులాబీ దళంలో గలాట.. క్రాస్ ఓటింగ్ కట్టప్పలు ఎవరన్నదే ఇక్కడ సస్పెన్స్..

TRS: పీక్‌స్టేజ్‌‌లో పినపాక గులాబీ ముసలం.. రేగా, పాయం మధ్య అంతర్యుద్ధం..

విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు