సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు..! చాలా నష్టం భరించాల్సి ఉంటుంది..

సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు..! చాలా నష్టం భరించాల్సి ఉంటుంది..
Second Hand Car

Second Hand Car: కొత్త లేదా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు ప్రజలు తరచుగా కొన్ని తప్పులు చేస్తారు. తద్వారా విలువైన సమయం,

uppula Raju

|

Jan 01, 2022 | 3:52 PM

Second Hand Car: కొత్త లేదా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు ప్రజలు తరచుగా కొన్ని తప్పులు చేస్తారు. తద్వారా విలువైన సమయం, డబ్బుని కోల్పోతారు. అయితే మొదటిసారి కారును కొనుగోలు చేసే వారికి సెకండ్ హ్యాండ్ వాహనం మంచి ఎంపిక. ఇది మీ డ్రైవింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది. కారు కొనడం అనేది చాలా పెద్ద విషయం జాగ్రత్తగా ఉండాలి. చాలా విషయాలు గమనించాలి. సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేటప్పుడు ఈ పొరపాట్లను చేయకండి. అవేంటో తెలుసుకుందాం.

1. టెస్ట్ డ్రైవ్ మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేసినా లేదా పూర్తిగా కొత్తది కొనుగోలు చేసినా దానికి ముందు కారుని పరిశీలించడం ముఖ్యం. టెస్ట్ డ్రైవ్ చేయడం ద్వారా కారు పరిస్థితి, పనితీరు గురించి తెలుసుకుంటారు. అలాగే టెస్ట్ డ్రైవ్ చేయడం ద్వారా విక్రేత ఇచ్చిన కారు వివరణ సరైనదా కాదా అని కూడా తెలుసుకుంటారు.

2. కారు ఫైనాన్స్ విషయం కార్ ఫైనాన్స్ కొత్త కార్లకు మాత్రమే కాదు.. సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా ఇస్తారు. ఈ రోజుల్లో ఫైనాన్సింగ్ కంపెనీలు ఉపయోగించిన కార్లకు తక్కువ వడ్డీ రేట్లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి.

3. క్షుణ్ణంగా తనిఖీ సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయదారు కారుని కొన్ని కారణాల వల్ల విక్రయిస్తాడు. ఆ కారణాలలో ఒకటి కారు పనితీరు సరిగా లేకపోవడం లేదంటే ఇతర సమస్యలు ఉండవచ్చు. కాబట్టి మీరు ముందుగా టెస్ట్ డ్రైవ్ పూర్తి చేయాలి. తర్వాత వాహనంలో సంభవించే సాంకేతిక సమస్యలను తనిఖీ చేయడానికి మెకానిక్‌ని మీతో తీసుకెళ్లడం మంచిది.

4. లుక్ ద్వారా మోసపోవద్దు మంచి కారు కళ్లకు చెడుగా కనిపించవచ్చు. చెడ్డ కారు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అందుకే మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారును దాని రూపాన్ని బట్టి కొనుగోలు చేయకూడదు. కారుని తనిఖీ చేస్తున్నప్పుడు మీ ఖచ్చితమైన అవసరాలను అర్థం చేసుకోవడం వాటిని పరిష్కరించడం ముఖ్యం.

5. కాగితపు పనిని విస్మరించవద్దు మీరు వాహనాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత రాత పనిని పూర్తి చేయడం చాలా ముఖ్యమైన విషయం. సెకండ్‌ హ్యాండ్‌ కారుని కొనుగోలు చేసేటప్పుడు రాత పనిని విస్మరించడం అతిపెద్ద తప్పులలో ఒకటి. ఈ రాతపని కారు చట్టబద్ధంగా మీదేనని నిర్ధారిస్తుంది. దీనినే RC బదిలీ ప్రక్రియ అని కూడా అంటారు. ఇది ఎక్కువ సమయం తీసుకోదు. డీలర్‌షిప్ నిర్వాహకులు నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. సమయానికి పత్రాలను అందజేస్తారు.

OLED డిస్‌ప్లేతో లాంచ్‌కానున్న Moto G71.. ధర, స్పెసిఫికేషన్ గురించి తెలుసుకోండి

పిల్లలు కారులో ప్రయాణిస్తుంటే సేఫ్టీ చాలా ముఖ్యం.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు..

వన్డే జట్టులోకి వచ్చేశారు.. రోహిత్‌ స్థానంలో దేశవాళీ ఆటగాడు.. హార్దిక్‌ పాండ్యా స్థానంలో మరో ఆల్‌రౌండర్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu