AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు కారులో ప్రయాణిస్తుంటే సేఫ్టీ చాలా ముఖ్యం.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు..

Child Safety Tips: పిల్లలు కారులో ప్రయాణిస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. భద్రత చాలా ముఖ్యం. పిల్లలు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల ఒక్కోసారి

పిల్లలు కారులో ప్రయాణిస్తుంటే సేఫ్టీ చాలా ముఖ్యం.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు..
Kids In Car
uppula Raju
|

Updated on: Jan 01, 2022 | 2:44 PM

Share

Child Safety Tips: పిల్లలు కారులో ప్రయాణిస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. భద్రత చాలా ముఖ్యం. పిల్లలు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల ఒక్కోసారి ప్రమాదంలో పడవచ్చు. అలాంటి సమయంలో భద్రతా చిట్కాలు తెలిసి ఉండాలి. కారులో పిల్లల భద్రత కోసం ముఖ్యమైన విషయం ఏంటంటే చైల్డ్ సేఫ్టీ లాక్‌ని ప్రారంభించడం. తద్వారా కారు నడుస్తున్నప్పుడు పిల్లలు విండోస్‌, డోర్స్‌ ఓపెన్ చేయలేరు. ఇలా చేయడం ద్వారా పిల్లలను ప్రమాదం నుంచి రక్షించవచ్చు. ఒక్కోసారి పిల్లలు అనుకోకుండా పవర్ విండోలో చేతులు, వేళ్లు లేదా తలను పిన్ చేయవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. అందువల్ల మీ కారులో విండోస్‌, డోర్స్‌ పూర్తి నియంత్రణను కలిగి ఉండటం మంచిది.

పిల్లలు కారులో భోజనం చేయకూడదు లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేటప్పుడు చిరుతిండి సమయం ఒక కాలక్షేపంగా ఉంటుంది. పెద్దలు ఆహారం తింటూ బయట దృశ్యాలను ఆస్వాదించడం మంచిదే అయినప్పటికీ అది మీ పిల్లలకు ప్రమాదాన్ని తెస్తుంది. ఎలాగంటే ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్డుపై ప్రయాణంలో గొంతులో ఆహారం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ప్రయాణానికి ముందే వారికి ఆహారం అందించడం మంచిది. లేదా కారును ఆపి ఆహారం తినిపించాలి.

సీటు బెల్ట్ అవసరం సీట్ బెల్ట్ సరిగ్గా అమర్చడం ముఖ్యం. మీరు మీ పిల్లలకు సీటు బెల్టులు కట్టి, వారిని సౌకర్యవంతంగా కూర్చోనివ్వండి. ఒక బెల్ట్ ఒకరికి మాత్రమే అని గుర్తుంచుకోండి. మీ పిల్లలను మీ చేతులలో కానీ కాళ్లపై కానీ ఎప్పుడు కూర్చోపెట్టుకోకూడదు. ప్రయాణంలో సురక్షితంగా ఉండాలంటే కంఫర్ట్ చాలా ముఖ్యం.

పార్క్ చేసిన కార్ల చుట్టూ ఆడకుండా చూడండి కారు లాక్ చేసినప్పటికీ పార్క్ చేసిన కార్ల చుట్టూ ఆడటానికి పిల్లలకు అనుమతి ఇవ్వకూడదు. ఇది సురక్షితం కాదు. వాహనం పార్కింగ్ కానీ బ్రేక్ చెడిపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. పొరపాటున ఇలాంటి సమస్యలు ఎదురవచ్చు. ఈ కారణంగానే పిల్లలను పార్కింగ్ చేసిన కార్ల చుట్టూ ఆడకుండా గమనించాలి.

Watch Video: డప్పుతో దరువేసిన వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్.. ఫిదా అవుతున్న అభిమానులు

Chanakya Niti: నేటి జనరేషన్ కు తెలియని.. ఆచార్య చాణక్యుడి జీవితానికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోండి..

Swiggy, Zomato: నేటి నుంచి అదనపు భారం.. 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థలు