Chanakya Niti: నేటి జనరేషన్ కు తెలియని.. ఆచార్య చాణక్యుడి జీవితానికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోండి..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. ఆచార్య తన అనుభవాలను  అనేక శాస్త్రాలుగా లిఖించాడు. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం నేటి..

Chanakya Niti: నేటి జనరేషన్ కు తెలియని.. ఆచార్య చాణక్యుడి జీవితానికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోండి..
Chanakya
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2022 | 2:19 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. ఆచార్య తన అనుభవాలను  అనేక శాస్త్రాలుగా లిఖించాడు. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం నేటి మానవులకు అనేక జీవిత విధానాలను నేర్పుతుంది.  అయితే ప్రస్తుత జనరేషన్ లో చాలా మందికి ఆచార్య చాణుక్యుడి గురించి పెద్దగా తెలియదు. ఆచార్య చాణక్యుడి జీవితానికి సంబంధించిన ఎవరూ చెప్పని విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

ఆచార్య చాణక్యుడు పుట్టిన సమయంలో అతని నోటిలో ఒక పన్ను ఉంది. ఆ చిన్నారి చాణుక్యుడిని చూసి ఒక జైన సన్యాసి ఈ పిల్లవాడు రాజు అవుతాడని చెప్పాడు. దీంతో చాణుక్యుడి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఆ ఋషి చాణుక్యుడి తల్లిదండ్రులతో.. ఆ దంతాన్ని తొలగిస్తే.. మీ భయాందోళనలు తొలగుతాయని చెప్పాడు.

ఆచార్యను చాణుక్యుడు అసలు పేరు విష్ణుగుప్త. శ్రీ చాణకుని కొడుకు కావడంతో చాణక్యుడు అని పిలిచేవారు. దౌత్యం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలు  వంటి విషయాలపై విష్ణుగుప్తుడికి మంచి పట్టుఉంది. తన జ్ఞానాన్ని ‘వంచక’గా ఉపయోగించడంలో గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు.

ఆచార్య చాణక్య తండ్రి మరణం అనంతరం.. రాధా మోహన్ అనే పండితుడు అతని సామర్థ్యాలను పసిగట్టాడు. అతనిని తక్షశిలా విశ్వవిద్యాలయంలో చేర్పించాడు. ఇక్కడి నుండి చాణుక్యుడి జీవితంలో కొత్త అధ్యయనం ప్రారంభం ప్రారంభమైంది. విద్యాభ్యాసం అనంతరం.. చాణుక్యుడు అదే విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. అనేక గ్రంథాలను రచించారు.

ఆచార్య చాణుక్యుడు..  చంద్రగుప్తుడి శత్రువులను బాగా అర్థం చేసుకున్నందున.. రోజూ చంద్రగుప్తుడు తినే ఆహారంలో తక్కువ మోతాదులో విషాన్ని ఇచ్చేవాడని చెబుతారు. భవిష్యత్తులో చంద్రగుప్తుడు శత్రువులు విషపూరిత దాడికి పాల్పడితే.. దానిని చంద్రగుప్తుడు సులభంగా భరించగలడని చాణుక్యుడు ఆలోచనగా చెబుతారు.

ఆచార్య చాణుక్యుడు మరణం గురించి అనేక కథలు వినిపిస్తాయి. కొంతమంది చాణుక్యుడు తన విధులను పూర్తి చేసుకుని ఒకరోజు రథాన్ని అధిరోహించి అడవుల్లోకి వెళ్లారని.. మళ్ళీ అడవులనుంచి తిరిగి రాలేదని కొందరు చెబుతారు. అయితే మరికొందరు మగధ రాణి హెలెనా చాణక్యుడికి విషం ఇచ్చి చంపిందని అంటారు. హెలెనా.. చాణుక్యుడిని హత్య చేసిందని ఇంకొందరు అంటారు.

Also Read:

నిద్రపోయేటప్పుడు ఈ 4 వస్తువులు తల దగ్గర పెట్టుకోకూడదు.. లేదంటే నష్టం వాటిల్లినట్లే.!

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..