Astro Tips: నిద్రపోయేటప్పుడు ఈ 4 వస్తువులు తల దగ్గర పెట్టుకోకూడదు.. లేదంటే నష్టం వాటిల్లినట్లే.!
మనం ఆరోగ్యం ఉండేందుకు ఆహారం, నీరు ఎంత అవసరమో.. కంటి నిండా నిద్ర కూడా అంటే ముఖ్యం. శరీరానికి అవసరమయ్యే నిద్ర పోయినప్పుడే..
మనం ఆరోగ్యం ఉండాలంటే ఆహారం, నీరు ఎంత అవసరమో.. కంటి నిండా నిద్ర కూడా అంటే ముఖ్యం. శరీరానికి అవసరమయ్యే నిద్ర సరిపోతేనే.. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. నిద్రపోయేటప్పుడు పలు వస్తువులను పొరపాటును కూడా మన దరిదాపుల్లో ఉంచకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే.. అవి మన నిద్రపై ప్రభావం చూపించడమే కాకుండా నెగటివ్ ఎనర్జీను కూడా తీసుకొస్తాయి. మరి ఇంతకీ ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.!
పుస్తకాలు:
మనలో చాలామందికి రాత్రిపూట చదువుకునే అలవాటు ఉంది. అలా చదువుకున్న తర్వాత పుస్తకాలను తల దగ్గర పెట్టుకుని నిద్రపోతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇలా చేయడం విద్యను అవమానించడమేనని పండితులు అంటున్నారు. మీ కెరీర్‌లో ఎత్తుపల్లాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే దీన్ని ఆశుభంగా కూడా పరిగణిస్తారు.
పాదరక్షలు:
వాస్తు ప్రకారం, పాదరక్షలు ఎప్పుడూ కూడా మంచం తల దగ్గర ఉండకూడదు. బూట్లు, చెప్పులు కూడా మంచం కింద పెట్టకూడదు. ఒకవేళ పెట్టినట్లయితే.. ఆర్థిక, శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
పర్సు:
మనలో కొంతమంది ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు.. పర్సును తల దగ్గర పెట్టుకుని పడుకుంటాం. అలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ అలా చేస్తే.. ఆర్ధిక ఇబ్బందులతో పాటు ఒత్తిడిని కూడా ఎదుర్కునే అవకాశం ఉందని అంటున్నారు.
గాడ్జెట్లు:
నిద్రపోయేటప్పుడు తల దగ్గర గాడ్జెట్లు పెట్టుకోవద్దని నిపుణులు అంటున్నారు. వాటి నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా మన నిద్రపై ప్రభావం పడటమే కాకుండా.. ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.