AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల కొండలు

ప్రపంచమంతా పార్టీలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా అందుకు భిన్నంగా గోవిందనామస్మరణతో తిరుమలలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు శ్రీవారి భక్తులు.

Tirumala: ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల కొండలు
Tirumala
Balaraju Goud
|

Updated on: Jan 01, 2022 | 7:52 AM

Share

Tirumala New Year Celebrations: ప్రపంచమంతా పార్టీలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా అందుకు భిన్నంగా గోవిందనామస్మరణతో తిరుమలలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు శ్రీవారి భక్తులు. సరిగ్గా 12 గంటలకు భక్తులందరూ గోవింద నామాన్ని జపించడంతో తిరుగిరులు మార్మోగాయి. దీంతో శ్రీవారి ఆలయం ముందు సందడి వాతావరణం నెలకొంది. టీటీడీ కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో తిరుమలకు అనుమతిస్తున్నప్పటికీ నూతన సంవత్సరం రోజు ఆ ప్రభావం కనిపించలేదు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆలయం ముందు నూతన సంవత్సర శోభ కనిపించింది. తిరుమలకు వచ్చిన భక్తులందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఆలయం ముందుకు వచ్చారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు నూతన సంవత్సర వేడకలతో కళకళలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Read Also…. Vaishno Devi Temple: వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు