Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishno Devi Temple: వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లోని కొత్త సంవత్సరం సందర్భంగా మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. దీని కారణంగా ఇప్పటివరకు 12 మంది మరణించారని, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని సమాచారం.

Vaishno Devi Temple: వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Vaishno Devi Temple
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 01, 2022 | 10:44 AM

Jammu Kashmir Stampede at Mata Vaishno Devi Bhawan: జమ్మూ కాశ్మీర్‌లోని కొత్త సంవత్సరం సందర్భంగా మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. దీని కారణంగా ఇప్పటివరకు 12 మంది మరణించారని, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని సమాచారం. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన త్రికూట కొండలపై ఉన్న ఆలయ గర్భగుడి వెలుపల జరిగింది.

కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా శనివారం తెల్లవారుజామున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇంతలో తొక్కిసలాట జరిగింది. జిల్లా అధికారులు, ఆలయ బోర్డు అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. పలువురు వ్యక్తులు చనిపోయారని వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ మరో 26 మందిని మాతా వైష్ణో దేవి నారాయణ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో సహా ఇతర ఆసుపత్రుల్లో చేర్చారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు  ఉన్నారని తెలిపారు.

కాగా, మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్‌తో మాట్లాడిన ప్రధాని.. బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు PMNRF నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపిన ప్రధాని మోడీ.. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తామన్నారు.

ఇదిలావుంటే, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం ట్వీట్ చేస్తూ, తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చును దేవస్థానం బోర్డు భరించనున్నట్లు తెలిపింది. Read Also….   Happy New Year 2022: కొత్త ఏడాది 2022కి ఘనంగా స్వాగతం పలుకుతూ తెలుగు ప్రజల సంబరాలు