AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Post Payments: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌దారులు అలర్ట్‌.. నేటి నుంచి కొత్త ఛార్జీలు.. పూర్తి వివరాలు

India Post Payments: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంకింగ్‌ రంగంలో కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నిబంధల ప్రకారం ఈ కొత్త మార్పులు..

India Post Payments: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌దారులు అలర్ట్‌.. నేటి నుంచి కొత్త ఛార్జీలు.. పూర్తి వివరాలు
Subhash Goud
|

Updated on: Jan 01, 2022 | 7:18 AM

Share

India Post Payments: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంకింగ్‌ రంగంలో కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నిబంధల ప్రకారం ఈ కొత్త మార్పులు జరగనున్నాయి. ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఖాతా ఉన్న వారు ఈ ఏడాది నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసినా, డిపాజిట్‌ చేసినా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. డబ్బుల ఉపసంహరణ, డిపాజిట్‌ లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయని ఇండియా పేమెంట్‌ బ్యాంక్‌ తెలిపింది. పరిమితి దాటితే ఛార్జీలు ఉంటాయని వెల్లడించింది.

వేర్వేరు ఛార్జీలు.. అయితే ఈ ఛార్జీలు అందరికి ఒకేలా ఉండవు. వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతా ఉన్నవారికి నెలకు నాలుగు సార్లు డబ్బులను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉపసంహరించకోవచ్చు. కానీ ఆ తర్వాత డబ్బులు ఉపసంహరించుకుంటే ఛార్జీలు తప్పవు. మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 లావాదేవీకి ముట్టజెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఖాతా ఉన్నవారు క్యాష్‌ డిపాజిట్‌ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు.

ఇతర పొదుపు ఖాతాలున్నవారు నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది పూర్తిగా ఉచితం. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే మొత్తం 0.50 శాతం లేదా కనీసం రూ.25 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతా కలిగిన వారు రూ.10వేల వరకు క్యాష్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ రూ.10వేలకుపైగా డిపాజిట్‌ చేసుకుంటే 0.50 శాతం లేదా రూ.25 ప్రతి లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి. ఈ నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కస్టమర్ల ఈ విషయాలను గమనించడం తప్పనిసరి. లేకుంటే ఎక్కువ విత్‌డ్రాలు చేసుకుంటే అదనంగా ఛార్జీల బదులు తప్పనిసరి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

PM Kisan: రైతన్నలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు..!

Taxpayers: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్నారా..? కావాల్సిన పత్రాలు ఇవే..!

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్