Taxpayers: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్నారా..? కావాల్సిన పత్రాలు ఇవే..!

Taxpayers: అదాయపు పన్ను రిటర్న్‌ ఐటీఆర్‌ దాఖలు చేయడం అనేది ఒక పెద్ద పని. అయితే ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేసేందుకు డిసెంబర్‌ 31 చివరి గడువు. ఇందు కోసం..

Taxpayers: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్నారా..? కావాల్సిన పత్రాలు ఇవే..!
Follow us

|

Updated on: Dec 31, 2021 | 9:54 AM

Taxpayers: అదాయపు పన్ను రిటర్న్‌ ఐటీఆర్‌ దాఖలు చేయడం అనేది ఒక పెద్ద పని. అయితే ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేసేందుకు డిసెంబర్‌ 31 చివరి గడువు. ఇందు కోసం అనేక రకాల పత్రాలు అవసరమై ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది ఆదాయానికి సంబంధించి పత్రాలు. మీరు ఒక సంవత్సరంలో ఎక్కడ పెట్టుబడి పెట్టారో మీరు అందించే పత్రంలో తెలిసిపోతుంది. రిటర్న్‌ దాఖలు చేయడంలో మీరు ఏదైనా పత్రాలు అందించనట్లయితే అధిక మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ మీకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అందుకే మీకు నోటిసులు వచ్చినప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇందుకు సమయం కూడా వృధా పోవడమే కాకుండా అధిక మొత్తంలో డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. వినియోగదారులకు ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా భారత ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్‌ దాఖలు చేయడానికి సమయం ఇచ్చింది. ఈ సమయంలోగా అన్ని పత్రాలు పూర్తి చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం సుమారు నాలుగు నెలల సమయం ఇచ్చింది. దీంతో సరైన పత్రాలు సమర్పించేందుకు జాగ్రత్తలు పడవచ్చు. ఒక వేళ మీరు ఐటీఆర్‌ దాఖలు చేయబోతున్నట్లు మీ డబ్బులు వృధా కాకుండా ఈ డాక్యుమెంట్లు సమర్పించుకోండి.

పాన్‌, ఆధార్‌ కార్డు: ఐటీఆర్‌ దాఖలు చేయడానికి మొదట ముఖ్యమైన డాక్యుమెంట్‌ పాన్‌ కార్డు. పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడంలో పాన్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇక రెండో డాక్యుమెంట్‌ ఆధార్‌ కార్డు. ఆదాయపు పన్ను సెక్షన్‌ 139AA ప్రకారం.. ఆదాయపు పన్ను రిటర్న్‌ విజయవంతంగా దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులు పాన్‌, ఆధార్‌ను అందించడం ఎంతో ముఖ్యం. పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి ముందు ఆధార్‌, పాన్‌ లింక్‌ చేయడం కూడా ఎంతో అవసరం.

ఫారం -16: మీరు కంపెనీలో ఉద్యోగి అయితే జీతాన్ని ఆదాయంగా తీసుకుంటే ఐటీఆర్‌ దాఖలు చేయడానికి ఫారం-16 ఫారం అవసరం. ఈ ఫారాన్ని కంపెనీ జారీ చేస్తుంది. ఇది ఒక నిర్ధిష్ట సంవత్సరంలో కంపెనీ నుంచి తీసుకున్న ఆదాయాన్ని సూచిస్తుంది. దీనిపై కంపెనీ తరపున టీడీఎస్‌ తీసివేయబడుతుంది. ఫారం-16 పార్ట్‌A, పార్ట్‌-Bని కలిగి ఉంటుంది. పార్ట్‌Aలో కంపెనీ తీసివేసే అంశం గురించి ఉంటుంది. పార్ట్‌-Bలో ఉద్యోగి స్థూల జీతం ఆదాయం ఉంటుంది.

వేతన స్లిప్‌: ఇంటి అద్దె అలవెన్ష్‌, లీవ్‌ ట్రావెల్స్‌ ఎల్‌టీఏ, మెడికల్‌ అలవెన్స్‌, పర్సనల్‌ అలవెన్స్‌ మొదలైన రిటర్న్‌ దాఖలు చేయడానికి వేతన స్లిప్‌ అవసరం.

టీడీఎస్‌ సర్టిఫికేట్‌: మీరు జీతం కాకుండా ఇతర వాటి నుంచి సంపాదిస్తున్నట్లయితే దాని మీద టీడీఎస్‌ తీసివేయబడుతుంది. దీని సర్టిఫికేట్‌ కూడా సమర్పించాల్సి ఉంటుంది. వేతనం కాకుండా ఇతర ఆదాయాలపై వచ్చే వడ్డీపై టీడీపీ తీసివేయబడుతుంది. ఈ సర్టిఫికేట్‌ ఫారం-16 రూపంలో ఉంటుంది.

ఫారం-26AS: మీరు సెక్షన్‌ 80సీ, 80సీసీడీ (1), 80సీసీసీ ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందితే అప్పుడు ఈ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది.

పెట్టుబడికు సంబంధించిన పత్రాలు: మీరు సెక్షన్‌ 80సీ, 80 సీసీడీ (1), 80సీసీసీ వంటివి ఆదాయపు పన్ను కింద మినహాయింపు ప్రయోజనం పొందితే అప్పుడు ఈ వివరాలు అందించాల్సి ఉంటుంది. దీని కోసం రిటర్న్‌ దాఖలు చేసేటప్పుడు పెట్టుబడులకు సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బీమా పాలసీ ప్రీమియం, ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడి, ఈపీఎఫ్‌లో పెట్టుబడి, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

గృహ రుణాలకు సంబంధించి.. మీరు ప్రతి నెల గృహ రుణాలపై ఈఎంఐ చెల్లిస్తుంటే స్టేట్‌ మెంట్‌ను పన్ను రిటర్న్‌ ఫైల్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. ఈ స్టేట్‌మెంట్‌లో రుణం అసలు, వడ్డీకి సంబంధించిన పూర్తి వివరాలు పేర్కొనాలి. ఆదాయపు పన్ను సెక్షన్‌ 24 ప్రకారం రుణదాత గృహ రుణం వడ్డీపై రూ.2 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఐటీఆర్‌ దాఖలు చేసేటప్పుడు గృహ రుణానికి సంబంధించిన వివరాలు సమర్పించడం వల్ల భారీగా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Train Charges: ఒకే రూట్‌లోని రైళ్లకు వేర్వేరు ఛార్జీలు ఎందుకు ఉంటాయి..? ట్రైన్‌ టిక్కెట్స్‌ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

Dry List 2022: మద్యం షాపులకు కూడా సెలవులు ఉంటాయని మీకు తెలుసా..? ఏయే రోజుల్లో మూసి ఉంటాయి..!

హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది