AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Pay: వాట్సాప్‌లో బ్యాంకు బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవాలా..? ఇలా చేయండి..!

WhatsApp Pay: వాట్సాప్‌ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. వాట్సాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండటం లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు..

WhatsApp Pay: వాట్సాప్‌లో బ్యాంకు బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవాలా..? ఇలా చేయండి..!
Subhash Goud
|

Updated on: Dec 31, 2021 | 10:38 AM

Share

WhatsApp Pay: వాట్సాప్‌ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. వాట్సాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండటం లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ఇక కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రోజురోజుకు వాట్సాప్‌ కొత్త కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తోంది. ఇక పేమెంట్‌కు సంబంధించి ఫీచర్స్‌ను కూడా తీసుకువచ్చింది. డబ్బులను ఇతరులకు పంపుకోవడం, బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం వంటి ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

బ్యాంకు అకౌంట్‌ వివరాలను కూడా వాట్సాప్‌లో పొందుపర్చి లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇక బ్యాంకుకు సంబంధించిన బ్యాలెన్స్‌ను సైతం చెక్‌ చేసుకోవచ్చు. అయితే బ్యాంకు ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసేందుకు రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి సెట్టింగ్స్‌‌ ద్వారా, రెండోది వేరే వాళ్లకి మనీని పంపుతున్నప్పుడు కూడా బ్యాంకు బ్యాలెన్స్‌ చెక్ చేసుకోవచ్చు.

సెట్టింగ్స్ ఆప్షన్ ద్వారా బ్యాలెన్స్‌ చెక్‌..

► ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. ► అందులో కుడివైపు పైనున్న ఆప్షన్లలోకి వెళ్లాలి. ► అందులో పేమెంట్లపై క్లిక్‌ చేయాలి. ► పేమెంట్స్ మెథడ్స్‌ కిందనున్న బ్యాంకు అకౌంట్‌ను క్లిక్ చేయాలి. ► మీరు యాడ్ చేసుకున్న బ్యాంకు అకౌంట్లు అక్కడ కనిపిస్తాయి. లేకపోతే యాడ్‌ చేసుకోవచ్చు. ► ఆ అకౌంట్లలో ఏ బ్యాంకు ఖాతా వివరాలు కావాలో దానిపై క్లిక్ చేయాలి. ► ఆ తర్వాత వ్యూ అకౌంట్ బ్యాలెన్స్‌ను క్లిక్‌ చేయాలి. ► యూపీఐ పిన్‌ని నమోదు చేసి, మీ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.

డబ్బులు పంపే సమయంలో బ్యాలెన్స్‌ చెక్..

► డబ్బులు పంపే సమయంలో కూడా బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ► పేమెంట్ నోటిఫికేషన్ స్క్రీన్ పై ప్రిఫర్డ్ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి ► వ్యూ అకౌంట్ బ్యాలెన్స్‌ను క్లిక్‌ చేయాలి. ► మీ వాట్సాప్ అకౌంట్‌కు పలు బ్యాంకు అకౌంట్లు లింక్ అయి ఉంటే, ఆ బ్యాంకును సెలెక్ట్‌ చేసుకోవాలి. ► యూపీఐ పిన్‌ను నమోదు చేయాలి బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. ఈ విధంగా వాట్సాప్‌ ద్వారా కూడా బ్యాంకు బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకునే సదుపాయం ఉంది.

ఇవి కూడా చదవండి:

Taxpayers: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్నారా..? కావాల్సిన పత్రాలు ఇవే..!

Train Charges: ఒకే రూట్‌లోని రైళ్లకు వేర్వేరు ఛార్జీలు ఎందుకు ఉంటాయి..? ట్రైన్‌ టిక్కెట్స్‌ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో