Train Charges: ఒకే రూట్‌లోని రైళ్లకు వేర్వేరు ఛార్జీలు ఎందుకు ఉంటాయి..? ట్రైన్‌ టిక్కెట్స్‌ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

Train Charges: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే శాఖనే. ప్రతి రోజు రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరవేరుస్తుంటాయి..

Train Charges: ఒకే రూట్‌లోని రైళ్లకు వేర్వేరు ఛార్జీలు ఎందుకు ఉంటాయి..? ట్రైన్‌ టిక్కెట్స్‌ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 31, 2021 | 8:59 AM

Train Charges: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే శాఖనే. ప్రతి రోజు రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరవేరుస్తుంటాయి. దేశ వ్యాప్తంగా ప్రతి రోజు అనేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రైలులో తక్కువ ఛార్జీలు ఉంటాయి. అందుకే రైళ్లు ఆలస్యంగా నడిచినా చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఇక అనేక రకాల రైళ్లను రైల్వేలు నడుపుతున్నాయి. ఆ రైళ్లలో అనేక రకాల కోచ్‌లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. తద్వారా ప్రయాణీకుడు తన ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్రయాణించవచ్చు. స్లీపర్‌లో తక్కువ ఛార్జీలు, ఏసీలో ఎక్కువ, సౌకర్యాలు ఎక్కువ తక్కువగా ఉంటాయి. కానీ ఒకే రూట్‌లో వెళ్లే రెండు రైళ్లకు వేర్వేరు ఛార్జీలు ఉండగా, ఒక తరగతికి మాత్రమే వేరే ఛార్జీలు ఉంటాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రైలులో ఏ ప్రాతిపదికన ఛార్జీ నిర్ణయించబడుతుంది..? అనే విషయాలను తెలుసుకుందాం.

అన్నింటిలో మొదటిది మీరు ప్రయాణించే రైలు రకాన్ని బట్టి ఛార్జీలు ఆధారపడి ఉంటాయి. ఈ రైళ్లలో సబర్బన్ రైలు, మెయిల్ రైలు, ఎక్స్‌ప్రెస్ రైలు, AC సర్వీస్ రైలు మొదలైనవి ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని రైళ్లలో ఛార్జీల విధానం భిన్నంగా ఉంటుంది. ఈ రైళ్లలో గరీబ్ రథ్, రాజధాని, శతాబ్ది, వందే భారత్, తేజస్, హమ్‌సఫర్, గతిమాన్, ఆంటోడే, జన్ శతాబ్ది వంటి ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. రైలు ఛార్జీలు కిలోమీటరు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారనే దాని ఆధారంగా ఛార్జీలను నిర్ణయిస్తారు రైల్వే అధికారులు. అలాగే అందులో అనేక రకాల ఛార్జీలు ఉంటాయి. ఇది రైలు రకాన్ని బట్టి ఉంటుంది. ఈ ఛార్జీలలో కనీస దూర ఛార్జీ, కనీస సాధారణ ఛార్జీలు, రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ ఛార్జీలు, GST మొదలైనవి ఉంటాయి. వీటన్నింటిని కలిపి టికెట్ రేటును నిర్ణయించారు.

వీటిలో చాలా ఛార్జీలు రైలు రకాన్ని బట్టి ఉంటాయి. ఉదాహరణకు, సూపర్ ఫాస్ట్ రైళ్లలో మాత్రమే సూపర్ ఫాస్ట్ ఛార్జీ విధించబడుతుంది. రైలు టిక్కెట్‌లో ఎన్ని రకాల ఛార్జీలు చేర్చబడతాయి. రైలు ప్రయాణించే కిలోమీటర్ల ఆధారంగానే రైలు ఛార్జీలు ఉంటాయని మీకు అర్థమై ఉంటుంది. ఇందులో 1-5 కిలో మీటర్ల దూరం వరకు ఒక ఛార్జీ ఉంటుంది. అలాగే 6-10, 11-15, 16-20, 21-25 నుండి 4951-5000 వరకు ఇలా కిలోమీటర్లలో కూడా కేటగిరీలు ఉంటాయి. రైలులో మీరు ప్రయాణించే దూరం ప్రకారం.. కిలోమీటర్ల చొప్పున రైలు ఛార్జీలు ఉంటాయి.

తత్కాల్ టికెట్ మీరు తత్కాల్ టికెట్ కొనుగోలు చేస్తే తత్కాల్ ఛార్జీలు విడిగా జోడించబడతాయి. అది కూడా కిలోమీటర్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. దీని తర్వాత ఇతర ఛార్జీలతో కలిపి తత్కాల్ రేటు నిర్ణయించబడుతుంది.

ఇవి కూడా చదవండి:

IRCTC Tour Package: పర్యటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. అదిరిపోయే టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు

Indian Railways: రైల్వే స్క్రాప్ విక్రయాలతో రూ. 402.5 కోట్లు ఆదాయం.. గతేడాదితో పోలిస్తే..