Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే స్క్రాప్ విక్రయాలతో రూ. 402.5 కోట్లు ఆదాయం.. గతేడాదితో పోలిస్తే..

Indian Railways: ఉత్తర రైల్వే 402.51 కోట్ల రూపాయలను ఆర్జించిందని, స్క్రాప్ విక్రయాల్లో రికార్డు సృష్టించిందని భారతీయ రైల్వే ఉత్తర రైల్వే జోన్ జనరల్ మేనేజర్..

Indian Railways: రైల్వే స్క్రాప్ విక్రయాలతో రూ. 402.5 కోట్లు ఆదాయం.. గతేడాదితో పోలిస్తే..
Follow us
Subhash Goud

|

Updated on: Dec 30, 2021 | 7:46 PM

Indian Railways: ఉత్తర రైల్వే 402.51 కోట్ల రూపాయలను ఆర్జించిందని, స్క్రాప్ విక్రయాల్లో రికార్డు సృష్టించిందని భారతీయ రైల్వే ఉత్తర రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అశుతోష్ గంగల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన రూ.208.12 కోట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 93.40 శాతం ఎక్కువ. అయితే పనికి రాని రైల్వే ఇంజన్లలోని వస్తువులు, బోగిలకు సంబంధించిన ఇనుప వస్తువులను విక్రయించింది రైల్వే. సెప్టెంబర్ 2021లో రూ.200 కోట్లు, అక్టోబర్ 2021లో రూ.300 కోట్లు మరియు డిసెంబర్ 2021లో రూ.400 కోట్ల స్క్రాప్ విక్రయాలు జరిగినట్లు తెలిపారు. అన్ని జోనల్ రైల్వేలు, ఉత్పత్తి యూనిట్లలో ఉత్తర రైల్వే అగ్రస్థానంలో ఉంది. నవంబర్ 2021లో రూ. 370 కోట్ల స్క్రాప్ అమ్మకాల లక్ష్యాన్ని ఉత్తర రైల్వే కూడా సాధించిందని తెలిపారు. ఇతర జోనల్ రైల్వేలు, ఉత్పత్తి యూనిట్లతో పోలిస్తే ఉత్తర రైల్వే ముందంజలో ఉంది.

రైల్వేకు చెందిన స్క్రాప్ నుండి సంపాదించడమే కాకుండా, రైల్వే ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంలో ఆ డబ్బులు ఎంతగానో ఉపయోగపడనున్నట్లు తెలిపారు. రైల్వే ట్రాక్‌లు, స్లీపర్‌లు, టైర్లు తదితరాలు రైల్వే లైన్ల చుట్టూ పడి ఉండడం వల్ల భద్రతకు కూడా ప్రమాదం పొంచి ఉందని, ఇలాంటి వాటిని తొలగించడం జరిగిందన్నారు. అదేవిధంగా నీటి ట్యాంకులు, క్యాబిన్లు, క్వార్టర్లు, ఇతర నిర్మాణాలు వంటి నిరుపయోగంగా ఉన్న వస్తువులను విక్రయించడం జరిగిందన్నారు. అయితే ఉత్తర రైల్వేలో పెద్ద మొత్తంలో స్క్రాప్ జమ చేయబడింది. పనికి రాకుండా పోయిన ఇలాంటి స్క్రాప్, పీఎస్‌సీ స్లీపర్‌లను తొలగిస్తున్నామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక స్క్రాప్ అమ్మకాల రికార్డును నెలకొల్పిందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

Electric Cars: ఇండియాలో అత్యంత సరసమైన ధరలతో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌ కార్లు.. ఫీచర్స్‌, ఇతర వివరాలు

PAN Card: పాన్‌ కార్డు ఎలాంటి పనులకు ఉపయోగపడుతుంది..? పూర్తి వివరాలు