IRCTC Tour Package: పర్యటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. అదిరిపోయే టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు

IRCTC Tour Package: ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తుంటుంది. పర్యటకుల కోసం వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది...

IRCTC Tour Package: పర్యటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. అదిరిపోయే టూర్‌ ప్యాకేజీ.. పూర్తి  వివరాలు
Follow us

|

Updated on: Dec 30, 2021 | 9:52 PM

IRCTC Tour Package: ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తుంటుంది. పర్యటకుల కోసం వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. ఈ ప్యాకేజీ కింద బుకింగ్‌ చేసుకున్న వారికి భోజన వసతులతో పాటు పలు పర్యటక ప్రాంతాలను కవర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. సప్తగిరి పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ టూర్‌ ప్యాకేజీలో తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాలహాస్తి, తిరుచానూరు తదితర ప్రాంతాలను కవర్ చేసేలా రూపొందించింది. ఈ ప్యాకేజీలో 3 రాత్రులు, 4 రోజుల పాటు ఉంటుంది. ప్రతి గురువారం ఈ టూర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

అయితే ఐఆర్‌సీటీసీ సప్తగిరి టూర్‌ ప్యాకేజీ మొదటి రోజు కరీంనగర్‌ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ కింద బుక్‌ చేసుకున్న పర్యాటకులు ఎక్స్‌ ప్రెస్‌ రైలులో బయలుదేరుతారు. ఈ ప్యాకేజీల్లో తిరుమల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్‌తో పాటు ఇతర ఆలయాల్లో రెగ్యులర్ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

Irctc

ఇవి కూడా చదవండి:

Indian Railways: రైల్వే స్క్రాప్ విక్రయాలతో రూ. 402.5 కోట్లు ఆదాయం.. గతేడాదితో పోలిస్తే..

PAN Card: పాన్‌ కార్డు ఎలాంటి పనులకు ఉపయోగపడుతుంది..? పూర్తి వివరాలు