Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. ఈ రోజు తులం గోల్డ్ ఎంతుందంటే..
Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు, తగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ భయాలు, మార్కెట్లో మారుతోన్న పరిణామాలు వెరసి బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు, తగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ భయాలు, మార్కెట్లో మారుతోన్న పరిణామాలు వెరసి బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా భారీగా తగ్గాయి. ఏకంగా రూ. 250కిపైగా తగ్గి బంగారం కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి అవకాశంగా మారింది. శుక్రవారం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320 వద్ద ఉంది.
* ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,760 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో మాత్రం పెరిగి రూ.48,760 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,020 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,120 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. * తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 వద్ద కొనసాగుతోంది.
* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 వద్ద కొనసాగుతోంది.
Also Read: Gold Price: వినియోగదారులకు కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాకివ్వనున్నాయా..? కారణం ఏమిటి..?
IRCTC Tour Package: పర్యటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్.. అదిరిపోయే టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు