Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతన్నలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు..!

PM Kisan: మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్యుల కోసం పలు రకాల స్కీమ్స్‌ను ప్రవేశపెట్టింది...

PM Kisan: రైతన్నలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు..!
Pradhan Mantri Kisan Samman Nidhi
Follow us
Subhash Goud

|

Updated on: Jan 01, 2022 | 6:56 AM

PM Kisan: మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్యుల కోసం పలు రకాల స్కీమ్స్‌ను ప్రవేశపెట్టింది. అందులో అన్నదాతల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ ) పథకం ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.6 వేలను జమ చేయనుంది. అయితే ఈ డబ్బులను కేంద్రం ఒకేసారి కాకుండా విడుదల చేయకుండా విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ప్రతి విడతలోనూ రూ. 2 వేలను నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి పంపిస్తుంది. ఇప్పటివరకు తొమ్మిది విడతల వారిగా నగదు జమ చేసింది కేంద్రం. తాజాగా రైతులకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది.

పీఎం కిసాన్ పదవ విడత మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జనవరి 1న జమ చేయనున్నట్లుగా ప్రకటించింది. జనవరి 1న పదికోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 20,000 కోట్లను ప్రధాన మంత్రి బదిలీ చేయనున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు 1.6 లక్షల కోట్ల రూపాయలను రైతుల బ్యాంకుల ఖాతాలకు బదిలీ చేసింది కేంద్రం ప్రభుత్వం. పీఎం కిసాన్ స్కీమ్ కింద జనవరి 1న మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి రైతుల ఖాతాల్లోకు బదిలీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి 351 ఎఫ్పీఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (FPO)లకు 14 కోట్ల రూపాయల ఈక్విటీ గ్రాంట్‏ను కూడా విడుదల చేస్తారు. దీంతో 1.24 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. ఎఫ్పీఓతో ఇంటరాక్ట్ చేయడంతోపాటు, ప్రధాన మంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చదవండి:

Train Charges: ఒకే రూట్‌లోని రైళ్లకు వేర్వేరు ఛార్జీలు ఎందుకు ఉంటాయి..? ట్రైన్‌ టిక్కెట్స్‌ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

Dry List 2022: మద్యం షాపులకు కూడా సెలవులు ఉంటాయని మీకు తెలుసా..? ఏయే రోజుల్లో మూసి ఉంటాయి..!

Petrol Diesel Price: 2021లో మంట పుట్టించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరి న్యూ ఇయర్‌లో ఎలా ఉండబోతున్నాయి..!