Happy New Year 2022: కొత్త ఏడాది 2022కి ఘనంగా స్వాగతం పలుకుతూ తెలుగు ప్రజల సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర సందడి నెలకొంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పోలీసులు 2022ని ఘనంగా స్వాగతం పలికారు.

Happy New Year 2022: కొత్త ఏడాది 2022కి ఘనంగా స్వాగతం పలుకుతూ తెలుగు ప్రజల సంబరాలు
New Year
Follow us

|

Updated on: Jan 01, 2022 | 7:03 AM

New Year Celebrations: తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర సందడి నెలకొంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పోలీసులు 2022ని ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో అయితే జోష్‌ మామూలుగా లేదు. ప్రజలు పెద్దగా బయటకు రానప్పటికీ.. ఈవెంట్లు, పబ్బులు, తమ తమ అపార్ట్‌మెంట్లు, ఇండ్లలోనే పార్టీల్లో మునిగిపోయారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, తిరుపతి, కరీంనగర్‌, వరంగల్‌ ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో న్యూ ఇయర్‌ ఈవ్‌ అదిరిపోయింది. హైదరాబాద్‌ మహానగరంలో అర్థరాత్రి వరకు సెలబ్రేషన్స్‌ జరిగాయి. న్యూఇయర్‌ మొదలవగానే.. మూడు కమిషనరేట్ల సీపీలు తమ తమ ప్రాంతాల్లో కేక్స్‌ కట్‌ చేశారు. ఈ ఏడాది క్రైమ్‌ తగ్గాలని ఆకాంక్షించారు.

ఇక, పబ్బుల్లో యువత ఎంజాయ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లో పరిస్థితి ఎప్పటిలాగానే తయారైంది. తప్పతాగి రోడ్లపైకి వచ్చి రచ్చ చేశారు కొందరు. మరోవైపు నగరం అంతా డ్రంకెన్‌ డ్రైవ్‌లు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఏపీలోనూ న్యూఇయర్‌ సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖలో గుళ్లకు పోటెత్తారు జనం. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని దేవుళ్లను కొరుకున్నారు. విజయవాడ, రాజమండ్రి, తిరుపతిలో ప్రజలు ఇళ్లలోనే సంబరాలు చేసుకున్నారు. ఆంక్షలు ఉండడంతో బయటకు రాలేదు. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్‌లో అయ్యప్పలు రాత్రంతా జాగారం చేసి అయ్యప్ప దీక్షలు చేశారు.

Read Also… Benefits Of Vitamin D: విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా.. ఇలా బయటపడండి..!