Swiggy, Zomato: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే జీఎస్టీ చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు స్విగ్గీ, జోమాటో సేవలపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. క్లౌడ్ కిచెన్‌లు, సెంట్రల్ కిచెన్‌లు అందించే సేవలు రెస్టారెంట్ సర్వీస్ కింద కవర్ చేస్తూ శనివారం నుంచి 5 శాతం సేవల పన్ను చెల్లించాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఆదేశించింది. జీఎస్టీ పన్ను చెల్లించని రెస్టారెంట్లపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్రం హెచ్చరించింది.