చలికాలంలో మడమల పగుళ్లు వేధిస్తున్నాయా..! ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందుతారు..

Cracked Heels:శీతాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో మడమల పగుళ్ల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. కొందరికి చీలమండల పరిస్థితి

చలికాలంలో మడమల పగుళ్లు వేధిస్తున్నాయా..! ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందుతారు..
Cracked Heels
Follow us
uppula Raju

|

Updated on: Jan 01, 2022 | 5:30 PM

Cracked Heels:శీతాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో మడమల పగుళ్ల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. కొందరికి చీలమండల పరిస్థితి మరీ దారుణంగా ఉండడం వల్ల ఒక్కోసారి రక్తం వచ్చేస్తుంది. ఈ పరిస్థితిలో చాలా నొప్పి కలుగుతుంది. చలికాలంలో చర్మం పొడిగా మారడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితుల్లో పరిశుభ్రత పాటించకపోతే సమస్య మరింత జఠిలమవుతుంది. కొన్నిసార్లు ఇది ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. ఈ సమస్య మీకు కూడా ఎదురైతే కొన్ని రెమెడీలను ప్రయత్నించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు.

ఈ పరిష్కారాలు ఉపయోగపడవచ్చు 1. ఒక పిడికెడు వేప ఆకులను గ్రైండ్ చేసి దానికి మూడు చెంచాల పసుపు పొడిని కలపండి. ఈ పేస్ట్‌ను చీలమండల పగుళ్లపై అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను కడగాలి. ఈ రెమెడీని కొన్ని రోజులు కంటిన్యూగా చేయడం వల్ల చాలా ఉపశమనం పొందుతారు.

2. ప్రతి రాత్రి పడుకునేటప్పుడు పాదాలను శుభ్రం చేసుకోండి. తరువాత సమాన పరిమాణంలో గ్లిజరిన్, రోజ్ వాటర్ కలపండి. మడమలకు అప్లై చేయండి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లో మీ మడమలు మృదువుగా మారుతాయి.

3. రాత్రి పడుకునే ముందు పాదాలను బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని కొబ్బరి నూనెను పగిలిన మడమల మీద రాయండి. కాసేపు మసాజ్ చేసి ఆ తర్వాత సాక్స్ వేసుకుని నిద్రపోండి. ఇలా ప్రతిరోజూ చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా పెట్రోలియం జెల్లీని అప్లై చేయడం వల్ల మడమల పగుళ్లు త్వరగా తగ్గుతాయి.

4. పగిలిన మడమలను నయం చేయడానికి అవకాడో, అరటిపండు ప్యాక్ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం పండిన అరటిపండు, సగం పండిన అవకాడోను తీసుకొని దానిని కలపండి. అందులో కొద్దిగా కొబ్బరినూనె మిక్స్ చేసి పాదాలు కడిగిన తర్వాత ఈ ప్యాక్‌ని చీలమండల మీద అప్లై చేసి కొంత సేపు మసాజ్ చేయండి. దాదాపు 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత పాదాలను కడిగి శుభ్రం చేసుకోవాలి.

5. ప్రతి రాత్రి మీ పాదాలను గోరువెచ్చని నిమ్మకాయ నీటిలో కొంతసేపు ఉంచండి. తరువాత ఒక టీస్పూన్ కొబ్బరి నూనె, ఆలివ్ నూనెను తీసుకొని అందులో 5-6 చుక్కల ట్రీ ఆయిల్ కలపండి. తర్వాత ఈ నూనెతో పాదాలకు మసాజ్ చేసి నిద్రపోండి. దీంతో మడమల పగుళ్ల సమస్య దూరమవుతుంది.

తులారాశివారికి హెచ్చరిక.. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.. ఎందుకంటే..?

ఈ శ్రమ్‌ పోర్టల్‌లో మీ పేరు నమోదుచేసుకున్నారా.. ఈ 5 రాష్ట్రాల ప్రజలు ముందు వరుసలో ఉన్నారు..?

సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు..! చాలా నష్టం భరించాల్సి ఉంటుంది..