AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటున్న కింగ్ నాగార్జున, నాగ చైతన్య “బంగార్రాజు” టీజర్

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా "బంగార్రాజు". సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

Bangarraju : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటున్న కింగ్ నాగార్జున, నాగ చైతన్య బంగార్రాజు టీజర్
Bangarraju
Rajeev Rayala
|

Updated on: Jan 02, 2022 | 9:06 AM

Share

Bangarraju : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా “బంగార్రాజు”. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త ఏడాది  సందర్భంగా బంగార్రాజు మూవీ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. రొమాన్స్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ కలిసిన బంగాగ్రాజు టీజర్ అటు అక్కినేని అభిమానులే కాకుండా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. బంగార్రాజు క్యారెక్టర్ ఆత్మరూపంలో తిరిగి రావడంతో ఆసక్తికరంగా మొదలైన టీజర్..చిన్న బంగార్రాజు క్యారెక్టర్ లో నాగ చైతన్య చిలిపి చేష్టలతో ఎంటర్ టైనింగ్ గా మారింది. ఊరి సర్పంచ్ నాగలక్ష్మి (కృతి శెట్టి)ని ఇంప్రెస్ చేసేందుకు చిన్న బంగార్రాజు చేసే ప్రయత్నాలు, ఈ దేశానికే సర్పంచివి కావాలి అంటూ చెప్పే మాటలు నవ్వించాయి. రమ్యకృష్ణతో బంగార్రాజు చేసే రొమాన్స్ సోగ్గాడే చిన్ని నాయనా ను గుర్తుకుతెస్తుంది. గుడిలో ఆత్మగా బంగార్రాజు చేసే పోరాటాలు యమ ధర్మరాజు గ్రహించడం, లయకారుడి సన్నిధిలో అపశృతి కలి మాయకాకపోదు అంటూ చెప్పడం సీరియస్ నెస్ పెంచాయి. బంగార్రాజు, చిన్న బంగార్రాజు కలిసి నడుస్తూ రావడం ఫ్యాన్స్ కు ఫీస్టే అని చెప్పొచ్చు. ఇలా కమర్షియిల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ తో బంగార్రాజు టీజర్ అదిరిపోయింది. ఇక ఈ టీజర్ సోషల్ మీడియాలో 100 కే లైక్స్ తో మిలియన్ కొద్దివ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సినిమా టీజర్.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బంగార్రాజు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ‘కొత్తగా ఏమైంది.. అనుకున్నదే అయిందిగా’.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా.?

Ashok Galla’s Hero : సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా “హీరో” రిలీజ్ అప్పుడే..

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి