RRR Movie: ‘కొత్తగా ఏమైంది.. అనుకున్నదే అయిందిగా’.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా.?

RRR Movie: పరిస్థితిలు అన్ని బాగానే ఉన్నాయి. సినిమా విడుదల తేదీ ప్రకటించారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌ కూడా జరుగుతున్నాయి. మరో ఆరు రోజుల్లో థియేటర్‌లో సినిమాను చూద్దామకున్న ఫ్యాన్స్‌కు..

RRR Movie: 'కొత్తగా ఏమైంది.. అనుకున్నదే అయిందిగా'.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 02, 2022 | 6:54 AM

RRR Movie: పరిస్థితిలు అన్ని బాగానే ఉన్నాయి. సినిమా విడుదల తేదీ ప్రకటించారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌ కూడా జరుగుతున్నాయి. మరో ఆరు రోజుల్లో థియేటర్‌లో సినిమాను చూద్దామకున్న ఫ్యాన్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. జనవరి 7న విడుదల కానున్న సినిమాను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో దాదాపు మూడేళ్ల నుంచి వేచి చూస్తున్న అభిమానులకు ఈ వార్త ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం, పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో వాయిదా వేయడం అనివార్యం అని భావించిన మూవీ యూనిట్‌ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించేసింది. దీంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోలను వెండి తెరపై చూద్దామనుకున్న మెగా, నందమూరి ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాకు సంబంధించిన మీమ్స్‌ను పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కాస్త హాస్యంతో కూడిన ట్రోలింగ్‌ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టిం వైరల్‌ అవుతోన్న ట్రోలింగ్స్‌లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సై’ సినిమాలోని డైలాగ్‌ మొదటి వరుసలో ఉంది. ప్లేయర్స్‌లో స్ఫూర్తిని నింపే క్రమంలో రాజీవ్‌ కనకాల చెప్పే.. ‘ఎందుకు ఏడుస్తావ్‌. కొత్తగా ఏం జరిగింది, అనుకున్నదేగా జరిగింది’ డైలాగ్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాకు లింక్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ మొదలైనప్పుడు యంగ్‌గా ఉన్న ఎన్టీఆర్‌ విడుదల సమయానికి ముసలివాడిలా మారడంటూ డిజైన్‌ చేసిన మరో మీమ్‌ నవ్వుతెప్పిస్తోంది. ఏది ఏమైనా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి సినిమా ఇలాంటి సమయంలో విడుదలచేయకపోవడమే మంచిదని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌ కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. ఆర్‌.ఆర్‌.ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మరికొన్ని మీమ్స్‌పై ఓ లుక్కేయండి..

Also Read: పాదాల నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

ITR: గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేసిన 5.89 కోట్ల మంది.. చివరి రోజు 46.11 లక్షలకు పైగా దాఖలు..

Elon Musk: మస్క్ నోట శ్రీమంతుడు సినిమా మాట.. ఎంత తీసుకున్నామో అంతకంటే ఎక్కువ ఇవ్వాలటా..