AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BheemlaNayak: దుమ్మురేపిన “లాలా భీమ్లా.. డిజే వెర్షన్.. సోషల్ మీడియాను షేక్ చేసిన పాట

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సినీ అభిమానుల ఆనందోత్సాహాలను అంబరాన్ని తాకేలా చేసింది భీమ్లానాయక్ డీజే సాంగ్. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

BheemlaNayak: దుమ్మురేపిన లాలా భీమ్లా.. డిజే వెర్షన్.. సోషల్ మీడియాను షేక్ చేసిన పాట
Pawan
Rajeev Rayala
|

Updated on: Jan 02, 2022 | 8:50 AM

Share

BheemlaNayak: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సినీ అభిమానుల ఆనందోత్సాహాలను అంబరాన్ని తాకేలా చేసింది భీమ్లానాయక్ డీజే సాంగ్. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి గతనెల 7 వ తేదీన ఇదే “లాలా భీమ్లా అడవి పులి” గీతం విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం ఆయన తనదైన శైలిని పలికించారన్నది ఈ సాంగ్ వింటే అర్ధమవుతుంది. సామాజిక మాధ్యమాలలో సైతం హోరెత్తింది ఈ గీతం. ఇదే గీతాన్ని ఇప్పుడు డీజే వెర్షన్లో మరో మారు విడుదల చేసింది చిత్ర బృందం.

2021 కి వీడ్కోలు పలుకుతూ..నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం సినీ అభిమానుల ఆనందోత్సాహాలను మరోమారు అంబరాన్ని తాకేలా చేసింది. ‘భీమ్లా నాయక్’ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం మరింత హుషారు ను కలిగిస్తే మూడు నిమిషాల ముప్ఫై ఏడు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక డీజే వర్షన్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ పాట మిలియన్ కొద్దివ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ‘భీమ్లా నాయక్‘ చిత్రం ఫిబ్రవరి 25,2022 న విడుదల కానుంది. ఈ దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ‘కొత్తగా ఏమైంది.. అనుకున్నదే అయిందిగా’.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా.?

Ashok Galla’s Hero : సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా “హీరో” రిలీజ్ అప్పుడే..

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..

Follow Us
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం