అన్నదాతలకు శుభవార్త.. వ్యవసాయ రుణ లక్ష్యం పెంచే యోచనలో ప్రభుత్వం.. ఎంతమేరకంటే..?

అన్నదాతలకు శుభవార్త.. వ్యవసాయ రుణ లక్ష్యం పెంచే యోచనలో ప్రభుత్వం.. ఎంతమేరకంటే..?
Kisan

Budget 2022: ఈ విషయం అన్నదాతలకు శుభవార్తే అని చెప్పాలి. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు 2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యవసాయ

uppula Raju

|

Jan 02, 2022 | 2:53 PM

Budget 2022: ఈ విషయం అన్నదాతలకు శుభవార్తే అని చెప్పాలి. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు 2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.18 లక్షల కోట్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు. ప్రభుత్వం ఏటా వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని పెంచుతోంది. ఈసారి కూడా లక్ష్యాన్ని రూ.18 నుంచి 18.5 లక్షల కోట్లకు పెంచవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ నెల చివరి వారంలో బడ్జెట్ గణాంకాలను ఖరారు చేస్తూనే ఈ లక్ష్యాన్ని ఫిక్స్ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం బ్యాంకింగ్ రంగానికి వార్షిక వ్యవసాయ రుణ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ఇందులో పంట రుణాల లక్ష్యం కూడా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో వ్యవసాయ రుణాల ప్రవాహం క్రమంగా పెరిగింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల సంఖ్య లక్ష్యాన్ని మించిపోతోంది. ఉదాహరణకు, 2017-18లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 10 లక్షల కోట్లు కాగా, ఆ ఏడాది రైతులకు రూ.11.68 లక్షల రుణం అందించారు. అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.9 లక్షల కోట్ల పంట రుణం లక్ష్యం కాగా రూ.10.66 లక్షల కోట్ల రుణం ఇచ్చారు.

వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తికి రుణం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సంస్థాగత రుణాల కారణంగా, రైతులు అధిక వడ్డీకి ఇతరుల నుంచి రుణాలు తీసుకోకుండా తప్పించుకోగలుగుతున్నారు. సాధారణంగా వ్యవసాయ సంబంధిత పనులకు తొమ్మిది శాతం వడ్డీకే రుణాలు ఇస్తారు. అయితే రైతులకు చౌకగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం స్వల్పకాలిక పంట రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తోంది. రూ.3 లక్షల వరకు స్వల్పకాలిక పంట రుణాలపై ప్రభుత్వం 2% వడ్డీ రాయితీ ఇస్తుంది. దీంతో రైతులకు 7 శాతం ఆకర్షణీయమైన వడ్డీకి రుణాలు లభిస్తాయి. అంతే కాకుండా సకాలంలో రుణం చెల్లించే రైతులకు 3 శాతం ప్రోత్సాహకం కూడా అందజేస్తారు. అటువంటి పరిస్థితిలో వారికి రుణంపై వడ్డీ రేటు 4 శాతం మాత్రమే ఉంటుంది. ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్‌లో చిన్న, సన్నకారు రైతుల కవరేజీని పెంచడానికి ఆర్‌బిఐ కొలేటరల్ ఫ్రీ వ్యవసాయ రుణ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1.6 లక్షలకు పెంచాలని నిర్ణయించింది.

హిజాబ్ ధరించినందుకు క్లాస్‌లోకి నో ఎంట్రీ.. ముస్లిం బాలికల ఆందోళన.. ఎక్కడంటే..?

Worshiping Trees: ఈ చెట్లలో దేవతలు నివసిస్తారట.. అందుకే పూజిస్తారట..? ఆ చెట్లు ఏంటంటే..

Soft Chapati: చపాతి మెత్తగా ఉండాలంటే పిండిలో ఇవి కలపాలి.. అవేంటంటే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu